Trending

6/trending/recent

AP Cyclone Warning: ఏపీ వైపు దూసుకొస్తున్న పెనుతుఫాన్.. ఈ జిల్లాలకు హై అలర్ట్.. ప్రభుత్వం అప్రమత్తం..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ను ప్రకృతివైపరీత్యాలు వీడటం లేదు. ఇప్పటికే భారీ వర్షాలు, వరదల (AP Floods) ధాటికి దక్షిణ కోస్తా, రాయమలసీమ జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ఇప్పుడు ఉత్తరాంధ్ర వైపు పెనుముప్పు దూసుకొస్తోంది.

ఇదిలా ఉంటే ఏపీ తీరం వైపు పెనుముప్పు దూసుకొస్తోంది. బంగాళాఖాతంలోని అండమాన్ సమీపంలో ఏర్పడిన అల్పపీడనం.. గురువారం రాత్రికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

ఇది క్రమంగా పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ శుక్రవారం నాటికి తుఫాన్ గా మారనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది డిసెంబరు 4 తేదీ నాటికి క్రమంగా ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర కోస్తా-ఒడిశా తీరాలకు దగ్గరగా వచ్చే అవకాశముంది.

ప్రస్తుత వాతావరణ పరిస్థితులు సముద్ర నెలకొన్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ఇది పెనుతుపానుగా రూపాంతరం చెందే ప్రమాదమున్నట్లు తెలుస్తోంది. ఈ తుఫాన్ ప్రభావం ఈనెల 3వ తేదీ నుంచే కనిపించనుంది. ఈ తుఫాన్ కు జవాద్ గా నామకరణం చేయనున్నారు.

దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటు తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలై తీవ్రప్రభావం చూపుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఐదు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని.. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తీరం వెంబడి బలమైన గాలులు వీచే అవకాశముండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించింది.

ఉత్తరాంధ్రకు తుపాను హెచ్చరికల దృష్ట్యా ఆయా జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. అసవరమైన అన్ని చోట్లా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. 

అలాగే తుఫాన్ సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు ముగ్గురు ప్రత్యేక అధికారులను నియమించారు. విశాఖజిల్లాకు శ్యామలరావు, జిల్లాకు కాంతిలాల్ దండే, శ్రీకాకుళం జిల్లాకు హెచ్.అరుణ్ కుమార్ ను నియించారు. సంబంధిత అధికారులు వెంటనే ఆయా జిల్లాలకు వెళ్లి బాధ్యతలు స్వీకరించాలని సీఎం ఆదేశించారు.

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad