AP Capital: విశాఖ రాజధానికి ముహూర్తం ఇదే?.. లీక్ చేసిన ఏపీ మంత్రి, జగన్‌ సన్నిహిత నేత..

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

AP Capital update: ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిపై సీఎం జగన్ పూర్తి క్లారిటీతో ఉన్నారా..? సాంకేతిక అంశాలతో కూడిన కొత్త బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్లాన్ రెడీ చేశారా..? ఉగాది నాటికి స్పష్టమైన ప్రకటన చేయనున్నారా..?

AP New Capital:  ఆంధ్ర్రప్రదేశ్ (Andhra Pradesh)కు మూడు రాజధానుల విషయంపై ఏపీ ప్రభుత్వం వెనక్కు తగ్గలేదా..? ఏపీ అసెంబ్లీ (AP Assembly)లో  సీఎం జగన్  చెప్పినట్టు.. జస్ట్ బ్రేక్ మాత్రమేనా.. అంటే మూడు రాజధానుల బిల్లును వెక్కు తీసుకున్నామని. మళ్లీ త్వరలో మరో బిల్లు తెస్తామని అసెంబ్లీ వేదికగానే సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) స్పష్టత ఇచ్చారు. మూడు రాజధానుల విషయంలో మరింత కొత్తగా.. ఎలాంటి ఇబ్బందులు అంటే.. న్యాయపరమైన సమస్యలు లేకుండా ముందుకు రావాలనే.. సీఎం జగన్ మూడు రాజధానుల బిల్లును వెనక్కు తీసుకున్నారా..? అంటే అవునానే వైసీపీ (ycp) వర్గాల నుంచి సమాధానం వస్తోంది. తాజాగా   విశాఖ (Visakha)నే రాజధానిగా చేస్తుందని.. ఆ ప్రక్రియకు టైం కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.  ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని.. రానున్న శ్రీరామనవమి (Sriramanavami) రోజునే రాజధాని విషయంలో ప్రకటన కూడా చేస్తారని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఏపీకి చెందిన ఒక మంత్రి  ఆ విషయంపై స్పష్టత ఇచ్చారు.

ఇన్నాళ్లూ వేధించిన ప్రశ్నకి ఇక జగన్ మోహన్ రెడ్డి సర్కారు సమాధానం ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. మొన్న గురువారం ఏపీ మంత్రి ఈ విషయాన్ని ఇన్ డైరెక్ట్ గా చెప్పేశారు. రానున్న ఉగాది తర్వాత.. ఒక క్లియర్ ప్రకటన చేస్తారని.. ఈ విషయంలో సీఎం స్పష్టమైన వైఖరితో ఉన్నారని ఆ వ్యాఖ్యల సారాంశం. ఉగాదికి ఎలాగూ ఇంకేదైనా ప్రకటన చేసే అవకాశం ఉండవచ్చు.  అందులోనూ శ్రీరామనవమి రామ పట్టాభిషేకం.. అయోధ్య మహా రాజ్యానికి రాముడు వచ్చినట్టుగా పురాణం. ఇలాంటి రోజున రాజధానిని ప్రకటిస్తే బాగుంటుందని వైసీపీ అధినాయత్వం ఆలోచించిందని తెలుస్తోంది.

మూడు రాజధానుల బిల్లు రద్దు ప్రక్రియ తర్వాత ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి కాస్తంత వ్యతిరేకత వచ్చిందన్నది వాస్తవం. ప్రధాన ప్రతిపక్షం టీడీపికి ఇది ఒక అస్త్రంగా మారింది. అయితే అమరావతే రాజధాని కావాలంటూ అక్కడి రైతులు పగలనకా.. రాత్రనకా పోరాటాలు చేస్తూనే ఉన్నారు. దీనికి తోడు రైతులకు అండగా ఉంటామని టీడీపీ, బిజెపి జనసేన పార్టీలు కూడా ఇప్పటికే మాటిచ్చాయి కూడా. ఇదే ఇప్పుడు చిక్కుగా ఉంది.

అమరావతి రాజధానిగా ప్రకటించి వైసీపీ సర్కారు వెనక్కి తగ్గుతుందా...? లేకపోతే.. విశాఖ రాజధాని అంటూ తన స్టాండ్ పై నిలబడుతుందా అనేది తేలాల్సి ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నుంచీ ఇక్కడ టీడీపీ, స్థానిక బిజెపి జనసేన వరకూ అన్ని పార్టీలు ఏపీలో వైసీపీ సర్కారు మెడలు వంచడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. మరి ఈ తరుణంలో వైసీపీ అటెళ్తుందా..? ఇటొస్తుందా అన్నది తేలాలి. 

నిజానికి విశాఖలోనే రాజధాని ఏర్పాటు చేయాలన్నది వైసీపీలో ఉన్న క్లారిటీ. అక్కడ రాజధాని తెస్తేనే.. వైసీపీ తమ పంతం నెగ్గించుకున్నట్టు ఉంటుందని అందుకే విశాఖ పైనే ఫోకస్ ఉంటుందని చాలావరకూ మాట్లాడుకుంటున్నారు. విశాఖలో రాజధాని ఏర్పాటుకు సాంకేతిక అంశాల పరిశీలిన అనే మాట తప్పితే.. మిగతా అంశాలన్నిటినీ వైసీపీ ముందుకు తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు విశాఖలోనే రాజధాని వస్తుందనీ.. అదీ శ్రీరామనవమికి ఆ ప్రకటన వెలువడుతుందని తెలుస్తోంది. చూడాలి మరి ఇక ఏం జరుగుతుందో..?

AP Capital: విశాఖ రాజధానికి ముహూర్తం ఇదే?.. లీక్ చేసిన ఏపీ మంత్రి, జగన్‌ సన్నిహిత నేత..



Below Post Ad


Post a Comment

0 Comments