Anantapur district: పబ్జీకి బానిసైన విద్యార్థి.. ఆస్పత్రిలో షాకింగ్‌ సీన్‌..

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసై చాలామంది పిచ్చొళ్లుగా తయారవుతున్నారు. పబ్ జీని బ్యాన్ చేశాక.. ఆ గేమ్‌కు అలవాటుపడ్డ చాలామంది ప్రాణాలు తీసుకున్నారు. నిషేధం అనంతరం కూడా కొంతమంది విపీఎన్ (Virtual private network) ద్వారా ఈ గేమ్ ఆడుతూనే ఉన్నారు. తాజాగా అదేపనిగా సెల్‌ఫోన్‌లో ఆటలాడుతూ..ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు ఓ విద్యార్థి. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు గ్రామానికి చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థి సుబ్బరాయుడు రోజూ సెల్‌ఫోన్‌లో ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడేవాడు. క్రమంగా ఆ అలవాటు అతడికి వ్యసనంగా మారింది. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం అతడు సృహ తప్పి కిందపడిపోయాడు.

తల్లిదండ్రులు అతన్ని వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి కర్నూలుకు వెళ్లాలని సూచించారు. కర్నూలులో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ప్రస్తుతం ఐసీయులో చికిత్స పొందుతున్న ఆ విద్యార్థి తల్లిదండ్రులను గుర్తు పట్టలేకపోతున్నాడు. ప్రస్తుతం సుబ్బరాయుడు పరిస్థితి మెరుగు పడుతుందని కోలుకోవడానికి కొంతసమయం పడుతుందని వైద్యులు తెలిపారు. తల్లిదండ్రులు ఇలా  గేమ్స్ ఆడే పిల్లలపై ఓ కన్నేసి ఉంచితే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వారికి ఫోన్స్ ఇవ్వడం ఆపేయాలని.. తోటి పిల్లలతో కలిసి ఆడుకునేలా ప్రోత్సహించాలని కోరుతున్నారు.

Anantapur district: పబ్జీకి బానిసైన విద్యార్థి.. ఆస్పత్రిలో షాకింగ్‌ సీన్‌..


Below Post Ad


Post a Comment

0 Comments