Akhanda: సౌండ్ సిస్టం దెబ్బకు మంటలు.. ప్రేక్షకులకు ఊహించని షాక్

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను హిట్ కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ అఖండ.. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న ఈ సినిమాకు తమన్ బంపర్ హిట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. అయితే సినిమా ప్రదర్శిస్తున్న సమయంలో సౌండ్ సిస్టం నుంచి మంటలు రావడంతో ప్రేక్షకులు అక్కడి నుంచి పరుగుపెట్టారు. ఈ సంఘటన శ్రీకాకుళంలో చోటుచేసుకుంది.

శ్రీకాకుళం జిల్లాలో అఖండ షో వేస్తున్న సమయంలో ఒక్కసారిగా థియేటర్ సౌండ్ సిస్టం షార్ట్ సర్క్యూట్‌కు గురైంది.. స్క్రీన్ వెనుక ఉన్న సౌండ్ సిస్టం నుంచి మంటలు రావడంతో ప్రేక్షకులు భయాందోళనకు గురయ్యారు. శ్రీకాకుళంలోని రవిశంకర్ థియేటర్‌లో ఈ ఘటన జరగడంతో అప్రమత్తమైన యాజమాన్యం మంటలను అదుపులోకి తెచ్చింది.

అయితే.. అఖండ సినిమా ప్రదర్శిస్తున్న సమయంలో కొన్ని అపశృతులు చోటుచేసుకున్నాయి. మొన్న తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో అఖండ సినిమా చూస్తున్న డిస్ట్రిబ్యూటర్ గుండెపోటుతో థియేటర్‌లోనే మరణించారు. ఈ రోజు శ్రీకాకుళంలో స్క్రీన్ వెనుక ఉన్న సౌండ్ సిస్టంలో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు వ్యాపించాయి.

Akhanda: సౌండ్ సిస్టం దెబ్బకు మంటలు.. ప్రేక్షకులకు ఊహించని షాక్


Below Post Ad


Tags

Post a Comment

0 Comments