ఉద్యోగులకు 34 % ఫిట్మెంట్ ఇవ్వడం సాధ్యం కాదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు . సీఎం జగన్తో సజ్జల , మంత్రి బుగ్గన , సీఎస్ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ .. కరోనా , ఆర్థిక సంక్షోభం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని , సర్కార్ నిర్ణయించిన 14.29 % ఫిట్మెంటే ఇస్తామని చెప్పారు . వీలైనంత త్వరలో పీఆర్సీ ప్రకటిస్తామని , ఉద్యోగ సంఘాల డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్లామని సజ్జల తెలిపారు .
పీఆర్సీపై చర్చలు రేపటికి పూర్తికావచ్చు: సజ్జల
ప్రస్తుతం ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇస్తున్నామని తెలిపారు. ఉద్యోగుల వేతనం తగ్గకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మిగిలిన డిమాండ్ల పరిష్కారంపైనా చర్చించామన్నారు. సీఎస్ కమిటీ సిఫార్సు 14.29 ఫిట్‌మెంట్ అమలుచేస్తూ ఐఆర్‌కు రక్షణ కల్పిస్తున్నామని వివరించారు. పీఆర్సీపై చర్చల ప్రక్రియ రేపటికి పూర్తికావచ్చని సజ్జల అభిప్రాయపడ్డారు.
సజ్జలు గారు మాకు పడుకోబెట్టి ఉద్దరగా ఇవ్వడం లేదు కదా?అవతల తెలంగాణా 30 ఇచ్చింది ఆ తర్వాత రేట్స్ ఎలా పెరిగాయో తెలుసు కదా మీరు చెప్పే కారోనా సాకులకు మేమే దొరికామా ఎలక్షన్ ముందు మీ హామీలు ఏంటి ఇప్పుడు చెబుతున్నదేమిటి ? ఇంక 2years లో ఎలక్షన్ ఉన్నాయనే విషయం గుర్తుపెట్టుకోండి
ReplyDelete