Trending

6/trending/recent

Water Drinking Position: నిలబడి అస్సలు నీరు తాగకండి తాగితే ఎంత డేంజ‌రో తెలుసా..?

Why you should NEVER drink water standing up ???

మన దైనందిన జీవితంలో నీరు ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మనిషికి జీవన ఆధారం నీరు. 

ప్రతిఒకరు ఆరోగ్యంగా జీవించడానికి రోజు నీరు త్రాగడం చాలా ముఖ్యం అన్న సంగతి తెలిసిందే. ఇక సరైయన మోతాదులో నీరు తాగడం వల్ల దాదాపు 80 శాతం రోగాలను దూరం చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా నిద్రించేందుకు ముందు గ్లాసుడు నీళ్లు తాగడం ద్వారా గుండెపోటును దూరం చేసుకోవచ్చు. అలాగే స్నానానికి ముందు గ్లాసుడు నీళ్లు తాగితే రక్తపోటు తగ్గుతుంది.

అందుకే ప్రాణాధారం నీరే అంటారు. ఆరోగ్యంగా, అందంగా జీవించాలంటే శ‌రీరానికి స‌రిప‌డా నీరు తాగ‌డం చాలా ముఖ్యం.శరీరంలో నీటి శాతం ఎప్పుడైతే త‌గ్గుతుందో రకరకాల జబ్బులు మ‌న‌ల్ని చుట్టుముట్టేస్తాయి.

1. ఆర్థ్రరైటిస్ వచ్చే అవకాశం:

నిలబడి నీరు తాగితే ఆ నీరు చాలా స్పీడ్ గా కిందకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి జాయింట్స్ లో చేరుతుంది. దీని వల్ల పెద్ద వయసులో ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంది.

2. జీర్ణ సమస్యలు:

నిలబడి నీరు తాగితే ఆ నీరు పొట్ట లోపల జల్లులా పడుతుంది. దీనివల్ల జీర్ణకోశం కూడా దెబ్బతినే అవకాశం ఉంది. దీని వల్ల జీర్ణ సమస్యలు కూడా వస్తాయి. కూర్చుని నీరు తాగినప్పుడు శరీరం రిలాక్స్డ్ గా ఉంటుంది కాబట్టి ఆ నీటిని చక్కగా అబ్జార్వ్ చేసుకుంటుంది. అందువల్ల అరుగుదల బావుంటుంది.

3. దాహం తీరదు:

సరైన పొజిషన్‌లో నీళ్ళు తాగాకపోతే గ్లాసు నిండా నీళ్ళు తాగినా సరే దాహం తీరినట్టుండదు. కూర్చుని కాసిన్ని నీరు తాగినా దాహం తీరుతుంది.

4.కిడ్నీ పని తీరుని ప్రభావితం చేస్తుంది:

నిలబడి నీరు తాగుతున్నప్పుడు ఆ నీటిని సరిగ్గా ఫిల్టర్ చేసేందుకు కిడ్నీలకి ఛాన్స్ ఉండదు. తద్వారా కిడ్నీల్లోనూ, బ్లాడర్ లోనూ మలినాలు పేరుకుపోతాయి. దీనివల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్స్ రావడమే కాక ఒక్కోసారి కిడ్నీలు పర్మినెంట్ గా డామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. మూత్రపిండాలు కూడా కూర్చుని తాగినపుడు సమర్థవంతంగా పనిచేస్తాయట.

5. గుండెలో మంట:

నిలబడి నీళ్ళు తాగడం ఈసోఫేగస్ మీద ప్రెజర్ ని పెంచుతుంది. అందువల్ల పొట్టలోని ఆసిడ్స్ వెనక్కి వెళ్తాయి. దానివల్లే మనకి ఒక్కోసారి నీళ్ళు తాగగానే గుండెలో మంట గా అనిపిస్తుంది.

6. పోషకాలు అందవు:

కూర్చుని నీరు తాగినప్పుడు నీటిలోని న్యూట్రియెంట్స్ ని శరీరం అబ్జార్వ్ చేసుకుంటుంది. నిలబడి నీళ్ళు తాగితే అది జరగదు.

7. ఎముకలు బలహీనపడతాయి:

రాంగ్ పొజిషన్ లో నీళ్ళు తాగడం వల్ల శరీరం నీరసపడుతుంది. ఎముకలు కూడా బహహీనపడతాయి.

8. నరాల సమస్యలు:

నిలబడి ఉన్నప్పుడు శరీరం లో టెన్షన్ ఉంటుంది. ఆ పొజిషన్ లో నీళ్ళు తాగినప్పుడు నరాల సమస్యలకి దారి తీస్తుంది.

9. ఆసిడ్స్ ని డైల్యూట్ చెయ్యదు:

కూర్చుని కొంచెం కొంచెం గా నీరు తాగినప్పుడు శరీరంలోని ఆసిడ్ లెవెల్స్ సరిగ్గా ఉంటాయి. దీని వల్ల శరీర అన్ని క్రియలు సరిగ్గా జరుగుతుాయి. చల్లని నీరు కాకుండా కాస్త వేడిగా ఉన్న నీరు లేదా గోరు వెచ్చగా ఉండే నీరు తాగడం వల్ల రక్తనాళాల శుద్ధి, కొవ్వు పదార్థాలు తొలగిపోతాయి.

కూర్చుని కొంచెం కొంచెం గా నీరు తాగడం చాలా మంచిది. దీనివల్ల నీటిలోని న్యూట్రియెంట్స్ ని శరీరం సరిగ్గా అందుకోగలుగుతుంది. అంతే కాక నిలబడి నీరు తాగితే పెద్ద వయసులో మోకాళ్ళ నెప్పులూ, ఆర్థ్రైటిస్ వంటివి వచ్చే ఛాన్స్ పెరుగుతుంది.
Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad