- లీకులపై ఉద్యోగుల్లో ఉత్కంఠ
వేతన సవరణ పై గందరగోళం కొనసాగుతోంది. ఇదుగో అదిగో అంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతున్నప్పటికీ ఆర్థికశాఖ నుండి మాత్రం ఎటువంటి సంకేతాలు రావడం లేదు. తాజాగా సోమవారం సాయంత్రమే పిఆర్సి నివేదికను బహిర్గతం చేస్తారని విస్తృత ప్రచారం జరిగింది. అయితే, ఆ దిశలో ఎటువంటి చర్యలను ప్రభుత్వం తీసుకోలేదు. దీంతో ఉద్యోగులు తీవ్ర నిరాశకు గురయ్యారు. వాస్తవానికి 11వ వేతన కమిషన్ నివేదికను నివేదికను గత ఏడాది అక్టోబర్లోనే ప్రభుత్వానికి సమర్పించింది. దీనిని బహిర్గతం చేసి ఉద్యోగుల నుంచి అభిప్రాయాలను సేకరించాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఆ ప్రయత్నాలు ప్రారంభం కాలేదు. కాగా, గత నెల రోజులుగా ఉద్యోగులు, సంఘాల నేతల నుంచి ఒత్తిడి పెరుగుతోంది.