PRC Demand by APNGO: దీపావళికి పిఆర్‌సి ప్రకటించకపోతే కార్యాచరణ

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

  • ప్రభుత్వానికి, ఉద్యోగులకు వారధిలా పనిచేస్తా
  • రాష్ట ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్‌రెడ్డి
  • దీపావళికి పిఆర్‌సి ప్రకటించకపోతే కార్యాచరణ : ఎపిఎన్‌జిఒ

రాష్టంలో ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య వారధిలా పనిచేస్తానని ఎపిఎన్‌జిఒ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎన్‌ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు అన్ని సంఘాలనూ సమన్వయం చేసుకుని ముందుకెళ్లానని పేర్కొన్నారు. ఉద్యోగ ఉద్యమంలో 30 ఏళ్లకు పైబడి పనిచేసిన ఎన్‌ చంద్రశేఖర్‌రెడ్డి తన ఉద్యోగ సర్వీసు నుంచి ర్షిటైర్దు కాగానే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. ఈ మేరకు విజయవాడలోని ఎపిఎన్‌జిఒ రాష్ట్ర కార్యాలయంలో అభినందన కార్యక్రమం సోమవారం ఏర్పాటు చేశారు. పలువురు ఎపి జెఎసి, ఎపిఎన్‌జిజ నాయకులు చంద్రశేఖర్‌రెడ్డిని అభినందించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. పిఆర్‌సి వీలైనంత త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుందని అన్నారు. తనకు ఈ హోదా ఉద్యోగ ఉద్యమం ద్వారానే వచ్చిందని, భవిష్యత్తులో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.



Below Post Ad


Post a Comment

0 Comments