పాఠశాల విద్యాశాఖ కమిషనర్గా ఎస్ సురేష్ కుమార్ బాధ్యతలు అందుకున్నారు. ఇబ్రహీంపట్నంలో పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ కార్యాలయంలో ప్రస్తుతం కమిషనర్ కొనసాగుతున్న వి చినవీరభద్రుడు నుంచి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి రాజశేఖర్, సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ కె వెట్రిసెల్వి సురేష్కు అభినందనలు తెలిపారు. వి చినవీరభద్రుడు గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్గా గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం డైరెక్టర్గా కొనసాగుతున్న పి రంజిత్ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు.
New Director: పాఠశాల విద్య కమిషనర్ గాసురేష్ బాధ్యతల స్వీకరణ
November 30, 2021
0