- సరిగా హాజరుకాకుంటే చర్యలు
న్యూస్ టోన్, నవంబరు 5- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల హాజరుపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు సరిగా విధులకు సమయానికి హాజరవుతున్నారో లేదో గుర్తించి చర్యలు తీసుకోవాలని శుక్రవారం మెమో జారీ చేసింది. అన్ని ప్రభుత్వశాఖల కార్యదర్శులు ఇందుకు చర్యలు తీసుకోవాలని ఆ మెమో స్పష్టం చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వశాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు హాజరు విషయంలో తక్షణమే దృష్టి సారించాలని పేర్కొన్నారు. అన్ని శాఖల కార్యదర్శులు హాజరు విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
- బయోమెట్రిక్ హాజరుపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలి.
- వీటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలి.
- సచివాలయ ఉద్యోగుల హాజరు తీరూ పరిశీలించాలి
- స్వయంగా ఆశాఖలోని కార్యదర్శి దీనిపై దృష్టి పెట్టాలి.
- రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగులు కొందరు తగిన సమయానికి రావడం లేదు.
- ఉద్యోగుల హాజరు విషయంలో ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. ఇంతకుముందు స్పష్టమైన నిబంధనలు ఇచ్చాం.