Trending

6/trending/recent

India Coronavirus: దేశంలో పెరుగుతున్న కరోనా మరణాలు.. నిన్న ఎన్ని నమోదయ్యాయంటే..?

 India Covid-19 Updates: దేశంలో కరోనావైరస్ మహమ్మారి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. కోవిడ్ సెకండ్‌ వేవ్‌ అనంతరం.. కేసుల సంఖ్య తగ్గినట్లే తగ్గి మళ్లీ ఒక్కసారిగా పెరిగిన కేసులు ఆందోళనకు గురిచేశాయి. ఈ క్రమంలో కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. గడిచిన 24 గంటల్లో శనివారం దేశవ్యాప్తంగా 8,774 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 621 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 1,05,691 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 543 రోజుల తర్వాత దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య భారీగా తగ్గినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దేశంలో మార్చి తర్వాత రికవరీ రేటు గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం రికవరీ రేటు 98.30 శాతానికిపైగా ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

తాజాగా నమోదైన గణాంకాలతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,45,72,523 కి చేరగా.. మరణాల సంఖ్య 4,68,554 కి పెరిగినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా నిన్న కరోనా నుంచి 9,481 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 3,39,98,278 కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

కాగా.. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 121.94 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. గత 24 గంటల్లో 82.86 లక్షల మందికి పైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు.




Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad