Trending

6/trending/recent

Farm Laws Repeal : కేంద్రం సంచలన నిర్ణయం.. వ్యవసాయ చట్టాలు రద్దు: ప్రధాని మోదీ

కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాలను రద్దు చేశారు. శుక్రవారం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన మోదీ దేశంలోని రైతు సమస్యలపై మాట్లాడారు.

Farmer Laws Repeal : వివాదాస్పదమైన వ్యవసాయ చట్టాల విషయంలో.. కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. రైతులతో పాటు.. దేశ వ్యాప్తంగా విపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న ఈ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించారు. ఇవాళ.. జాతినుద్దేశించి చేసిన ఈ ప్రసంగంలో.. ఈ విషయాన్ని వెల్లడించారు. రైతుల మనోభావాలను గుర్తించామని.. దేశ వ్యాప్తంగా రైతులు పడుతున్న కష్టాలను తెలుసుకున్నామని మోదీ చెప్పారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సంచలన ప్రకటన చేశారు.

2020లో మూడు రైతు చట్టాలను తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం.. దీనికి వ్యతిరేకంగా రైతులు రోడ్డెక్కారు. వెంటనే రైతు చట్టాలను రద్దు చేయాలనీ డిమాండ్ చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాది కాలంగా రైతులు గుడారాలు ఏర్పాటు చేసుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. పంజాబ్, రాజస్థాన్ రైతులు జనవరి 26 రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఎర్రకోటను ముట్టడించారు. రైతుచట్టాలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇక ఈ చట్టాలు రైతులను కార్పెట్లకు బానిసలను చేస్తాయంటూ ప్రతిపక్ష పార్టీలు ధర్నాలు రాస్తారోకోలు చేశాయి. కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి దిగాయి. రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల పోరాటం ఏడాది దాటింది. ఈ పోరాటంతో 500 మందికి పైగా రైతులు ప్రాణాలు విధించారు. ఇక ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ శుక్రవారం జాతిని ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్బంగా రైతు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad