Trending

6/trending/recent

నా భార్య అలా చేయడం నచ్చడం లేదు.. ఏం చేయను..

 ఏ బంధమైనా నిలబడేది నమ్మకం పైనే. ముఖ్యంగా వివాహ బంధం. నమ్మకం లేకుంటే ఆ బంధం బీటలు వారడం ఖాయం. భార్యాభర్తలు తమ జీవిత భాగస్వామిపై నమ్మకం

  • చక్కని బంధంలో నిప్పులు పోసే అనుమానం
  • అనుమానపు పార్టనర్‌ని మార్చే చిట్కాలు

ప్రశ్న..

నా భార్యకు నాపై నమ్మకం లేదు. నన్ను ప్రతి విషయంలో అనుమానిస్తుంది. ఆమె అనుమానించిన ప్రతి సారి నేను ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వలేక విసిగిపోతున్నాను. మనశాంతి కూడా కోల్పోతున్నాను.ఈ స్ట్రెస్ తట్టుకోలేక విడిపోవాలని ఉంది. నేను ఏమి చేయాలి?

డాక్టర్ స్పందన.

ఏ బంధమైనా నిలబడేది నమ్మకం పైనే. ముఖ్యంగా వివాహ బంధం. నమ్మకం లేకుంటే ఆ బంధం బీటలు వారడం ఖాయం. భార్యాభర్తలు తమ జీవిత భాగస్వామిపై నమ్మకం కోల్పోయినప్పుడు ఆ ఇల్లు నరకంలా మారుతుంది. నిత్యం వాదనలు, అపార్థాలు పెరిగిపోతాయి. వివాహబంధం చాలా సున్నితమైనది. ఒక్క చిన్న అబద్ధం చాలు ఆ బంధాన్ని బీటలు వారేలా చేయడానికి. తన భర్త లేదా భార్య... తనతో అబద్ధమాడారని తెలిస్తే ఏ జీవితభాగస్వామి తేలికగా తీసుకోలేరు. అప్పట్నుంచి ప్రతీది అనుమానాలు, సందేహాలే తలెత్తుతాయి. మనుషులు తప్పులు చేయడం సహజం. ప్రపంచంలో తప్పు చేయని మనిషే ఉండడు. కాబట్టి కొన్నిసార్లు ఓపిక, సహనం, క్షమాగుణం వల్ల బంధం నిలబడుతుంది. మీ జీవిత భాగస్వామిపై మీరు నమ్మకం కోల్పోయినప్పుడు బంధం నిలబెట్టుకునేందుకు మీరు చేయాల్సిన ప్రయత్నాలు ఇవే. ఇవి మీకు మాత్రమే కాదు, అందరికీ వర్తిస్తాయి.

నమ్మకాన్ని సంపాదించడం..

మీ జీవిత భాగస్వామిపై నమ్మకం కోల్పోయినప్పుడు ఆ విషయాన్ని ఆ వ్యక్తితో నేరుగా చెప్పండి. తిరిగి నమ్మకాన్ని సంపాదించుకునే పనులు చేయమని సలహా ఇవ్వండి. అయితే ఆ నమ్మకం మీకు కలగడానికి సమయం చాలా పడుతుంది. మీరు కూడా సహనంగా వేచి ఉండాలి.

ప్రశాంతంగా ఎదిరించడం..

మీ భర్త లేదా భార్య తప్పు చేసినప్పుడు వారిని నిలదీయండి. ఆ పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోండి. కానీ అరుపులు, కేకలతో కాదు. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకుని ప్రశాంత వాతావరణంలోనే వారిని నిలదీయండి. మీరు అరవడం వల్ల మీ ఆరోగ్యం చెడిపోతుంది. అంతేకాదు సమస్య మరింత జఠిలంగా మారుతుంది.

మాట్లాడండి..

ఈ మధ్యకాలంలో ప్రతీ ఒక్కరూ ఫోన్‌కి తెగ అడిక్ట్ అయిపోయారు. ఎంతలా తినడం అయినా పక్కన పెడ్తారేమో కానీ, ఫోన్ మాత్రం పక్కన పెట్టరు. అయితే, ఈ అలవాటు రిలేషన్ షిప్స్‌పై మరింత ఎఫెక్ట్ చూపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. మీ బంధం మధ్యలో ఫోన్ ప్రభావం అంతగా ఉండకూడదు. అందుకే మీరు మీ భాగస్వామితో గడిపే సమయంలో ఫోన్‌ని పక్కనపెట్టడం మరిచిపోవద్దు. ఇంపార్టెంట్ విషయమైతేనే ఫోన్ అటెంప్ట్ చేయండి. లేకపోతే వదిలేయడం మంచిది. లైఫ్ పార్టనర్ ఎదురుగా అధికంగా ఫోన్ వాడడం అంత మంచిది కాదు. కాబట్టి మీరు కచ్చితంగా ఫోన్ పక్కనపెట్టడం అలవాటు చేసుకోండి. దీని వల్ల మీ పార్టనర్‌తో మీరూ హ్యాపీగా టైమ్ స్పెండ్ చేయగలుగుతారు. కాబట్టి ఇప్పట్నుంచీ మీ పార్టనర్‌తో గడిపే సమయంలో ఫోన్స్‌ని దూరం పెట్టండి.

చాలా మంది జీవితభాగస్వామిపై నమ్మకం కోల్పోయిన సంఘటన ఎదురైనప్పుడు గట్టిగా గొడవపడి మాట్లాడడం మానేస్తారు. కానీ అది సరైనది కాదు. మాట్లాడండి... మీరు ఏమనుకుంటున్నారో అన్నీ చెప్పండి. మీ భావాలను కమ్యునికేట్ చేయండి. చివరికి వారికే నిర్ణయాన్ని వదిలేయండి.

సాయం తీసుకోండి

మీరు మీ భర్త లేదా భార్యతో కమ్యూనికేట్ చేయలేనప్పుడు ఇద్దరికీ ఆప్తులైన వ్యక్తి సాయం తీసుకోవచ్చు. సమస్యను చెప్పి వారినే సలహా అడగండి. మీ ఇద్దరి గురించి తెలిసిన వ్యక్తి కచ్చితంగా మంచి దిశానిర్దేశం చేయవచ్చు.

ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి

మిమ్మల్ని మోసం చేసిన జీవితభాగస్వామి తప్పు తెలుసుకుని నిజాయితీగా ఉంటానని చెబితే... వారికి ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి. అలాగే వారు నిజంగా మారారో లేదో, పాత తప్పులే చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయండి. గుడ్డిగా నమ్మేయద్దు.

నమ్మకం ఉంచండి

ఏదయినా ఇబ్బంది ఎదురైనప్పుడు భాగస్వామిదే తప్పు అన్న ధోరణిలో మాట్లాడటం కూడా పొరపాటే. ఈ తీరువల్ల భాగస్వామిపై నమ్మకం ఉండదు. భాగస్వామితో ఏదీ పంచుకోకూడదనే నిర్ణయానికి వచ్చేస్తారు రెండోవారు. అందుకే ఎదుటివారు ఏదయినా చెప్పినప్పుడు ఆసక్తిగా వినాలి. దానిగురించి మాట్లాడాలి. తమవంతుగా సహకరించాలి. అవసరమైతే నిపుణులతోనూ చర్చించేందుకు సిద్ధమవ్వాలి.

అర్థం చేసుకోండి

కొందరు దంపతులు ఒకరిలో లోపాల్ని మరొకరు ఎత్తి చూపుతుంటారు. అవతలివారి స్థానంలో ఉండి మనం ఆలోచించ గలిగితే ఆ సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు. వారిలోని సానుకూలతల్ని గమనిస్తే సంతోషంగానూ ఉండొచ్చు.

వివాహబంధంలో అనుమానాలు, సందేహాలు తలెత్తినప్పుడు వాటిని పరిష్కరించుకునేందుకు ప్రయత్నం చేయండి. చివరకు ఏ మార్గం లేనప్పుడే బంధానికి స్వస్తి పలికే ఆలోచనలకు దారివ్వండి.

జీవిత భాగస్వామిపై నమ్మకం సడలిపోతోంది. తమ పార్ట్‌నర్‌ ఫోన్లు, సోషల్‌ మీడియా అకౌంట్లపై నిఘా పెడుతున్నట్లు సర్వేలో పాల్గొన్నవారిలో 45శాతం తెలిపారు. అలాగే కొత్త పరిచయాల కోసం డేటింగ్‌ యాప్స్‌, వెబ్‌సైట్లు ఉపయోగపడతాయని 58 శాతం మంది భావిస్తున్నారు. రిలేషన్‌షిప్లో ప్రైవసీ ముఖ్యమని 89 శాతం మంది నమ్ముతుండగా.. తమ వ్యక్తిగత పాస్‌వర్డ్‌లు, పిన్‌ నంబర్లను తమ పార్ట్‌నర్‌కు షేర్‌ చేస్తామని 84 శాతం మంది తెలిపారు. ఆన్‌లైన్‌ షాపింగ్‌ వెబ్‌సైట్లు, సోషల్‌ మీడియా అకౌంట్లు, నెట్‌ఫ్లిక్స్‌ వంటి వీడియో స్ట్రీమ్‌ సర్వీసులు, ఈ-మెయిల్‌ అకౌంట్లు, బ్యాంకు వెబ్‌సైట్‌ పాస్‌వర్డ్‌లను తమ భాగస్వామితో పంచుకుంటామని వెల్లడించారు. అయితే పరిచయం లేనివారితో ఓవర్‌ షేరింగ్‌ కూడా పెరిగిపోతోందని సర్వే పేర్కొంది. ముంబై, ఢిల్లీ, బెంగళూరులకు చెందిన 18ఏళ్లు నిండిన 600 మందిపై ఈ సర్వే నిర్వహించారు.


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad