Trending

6/trending/recent

Andhra Pradesh: పోలీసులకు కొత్త పవర్స్ ఇవ్వనున్న ప్రభుత్వం.. ఇకపై ఆ బాధ్యతలు వారికే.. !

Andhra Pradesh:  గుట్కా, జర్ధా, పాన్‌మసాలా.. తక్కువ ధరకే లభిస్తాయి. శరీరానికి డ్యామేజ్ ఎక్కువ చేస్తాయి. ఎక్కువగా పేద వర్గాలే వీటికి అలవాటుపడుతుంటారు. నిదానంగా ఇవి ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తాయి. ఇప్పటికే  గంజాయి అంతానికి నడుం బిగించిన ఏపీ సర్కార్.. హానికరమైన పదార్థాల నిషేధానికి కూడా రంగం సిద్దం చేసింది. యువత బంగారం భవిష్యత్‌ను నాశనం చేస్తోన్న గుట్కా, జర్ధా లాంటి వాటిపై ఉక్కుపాదం మోపాలని డిసైడయ్యింది. ఇప్పటికే వీటి తయారీ, క్రయవిక్రయాలపై ఆంక్షలు ఉన్నాయి. ఇకపై ఆంక్షలు కాదు.. ఏకంగా నిషేధమే. ఈ మేరకు చట్టం తీసుకురాబోతుంది ఏపీ సర్కార్. ఈ చట్టం ప్రకారం రాష్ట్రంలో గుట్కా, జర్ధా, పాన్‌మసాలా, తయారు చేసినా…విక్రయించినా కఠిన చర్యలు తీసుకోబోతున్నారు. ఎస్సై(S.I.)స్థాయి అధికారి సైతం గుట్కా అమ్మకాలపై చర్యలు తీసుకునే పవర్స్ ఇవ్వనున్నారు.

ప్రజంట్ రాష్ట్రంలో గుట్కా విక్రయాలు అడ్డుకునే అధికారం రాష్ట్ర ఆహార భద్రత అధికారులకు ఉంది. వీటి తయారీ, విక్రయాలను నిషేధిస్తూ ఫుడ్‌సేప్టీ కమిషనర్ ప్రతి సంవత్సరం ఆర్డర్స్ పాస్ చేస్తున్నారు. దీనిపై ఓ ఏజెన్సీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. నిషేధంపై ఉత్తర్వులు జారీ చేసే అధికారం పుడ్‌సేప్టీ అధికారులకు లేదంటూ కోర్టు స్టే విధించింది. దీనిపై డివిజన్ బెంజ్‌లో ప్రస్తుతం విచారణ సాగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు కేసులు నమోదు చేయవద్దంటూ రాష్ట్ర ఫుడ్‌సేప్టీ కమిషనర్ తమ స్టాఫ్‌కు ఆదేశాలు జారీ చేశారు.

ఈ నేపథ్యంలోనే హానికరమైన గుట్కా విక్రయాలను నిషేధిస్తూ బిల్లు ముసాయిదాని గవర్నమెంట్ సిద్ధం చేసింది. దీని ప్రకారం గుట్కా వ్యవహారాలు నేరుగా పోలీసుశాఖ రేంజ్‌లోకి వెళ్లనున్నాయి. వారికి ఫుల్ పవర్స్ రానున్నాయి. కేసు నమోదు చేస్తే నిందితులకు ఏడేళ్ల జైలు శిక్షతోపాటు లక్షకు తగ్గకుండా 5 లక్షల వరకు ఫైన్ విధించే అవకాశం ఉంది.



Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad