06:22 IST, Feb 03 2022
ఈ రోజు చలో విజయవాడ కార్యక్రమం. అడ్డుకుంటామని అంటున్న ప్రభుత్వం, చేసి తీరుతామని అంటున్న ఉద్యోగులు.
20:06 IST, Jan 27 2022
ఉద్యోగ సంఘాలను గౌరవించండి అని ఈరోజు 27.01.22 విలేకరుల సమావేశం బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ప్రజల మధ్య, ఉద్యోగుల మధ్య విభేధాలు పెట్టడం మానుకోవాలని తెలియ చేసారు.
19:46 IST, Jan 27 2022
ఉద్యోగులందరూ పాత జీతాలను కోరుతూ డి.డి.ఓ కు సమర్పించవలసిన లేఖ ప్రభుత్వం 17.1.2022న ఇచ్చిన GO Ms. No.1 ప్రకారం RPS-2015 కన్నా తక్కువ జీతాలు వస్తున్నందున, రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ వారి వారి జనవరి మాసపు జీతాలు పాత స్కేలులో RPS-2015 ప్రకారం GO Ms.No.8, Fin. (PC-TA) Dept dt. 17.1.2022 ద్వారా 1.7.2021వరకు పెండింగులో ఉన్న DAలు కలిపి జనవరి మాసపు జీతాలు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర కమిటీ తయారు చేసిన నమూనా పత్రం ప్రకారం సంతకాలు చేసి వారి వారి DDO లకు తక్షణమే అందచేయాలని రాష్ట్ర PRC సాధన సమితి ఏకగ్రీవంగా తీర్మానించడమైనది.Download Letter Click Here
16:19 IST, Jan 27 2022
అగ్నికి ఆజ్యం పోసే అంశాలపై మేం మాట్లాడామన్నారు.పే స్లిప్పులు వస్తే ఎంత పెరిగిందో.. ఎవరికి తగ్గిందో స్పష్టంగా తెలుస్తుందన్నారు. సీఎం జగన్ పాజిటీవ్ గా ఉండే వ్యక్తి అని.. చర్చలకు వెళ్లాల్సిందిగా నేతలకు ఉద్యోగులూ చెప్పాలన్నారు. ఉద్యోగుల లేఖ ఇచ్చిన రోజే ఈ నెల 27వ తేదీన మరోసారి చర్చిద్దామని చెప్పాం.. కానీ చర్చలకు వారే రాలేదన్నారు.
16:18 IST, Jan 27 2022
ప్రభుత్వం నాలుగుమెట్లు దిగడానికి సిద్ధంగానే ఉందని చెప్పారు. రెచ్చగొట్టే మాటలను మేం పట్టించుకోబోమని స్పష్టం చేశారు. అనాలోచితంగా నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. ఉద్యోగ సంఘాలు మొండివైఖరితో వ్యవహరించొద్దని సజ్జల చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు మాకు శత్రువులు కాదన్నారు.
16:18 IST, Jan 27 2022
ఉద్యోగులతో చర్చలు జరపడానికి మేం సిద్దంగా ఉన్నామని ఏపీ ప్రభుత్వ సలహా దారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. ఎక్కడో కూర్చుని మాట్లాడితే సమస్యకు పరిష్కారం రాదన్నారు. సమ్మెకు వెళ్లడం సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం చట్ట విరుద్ధమని తెలిపారు. రేపట్నుంచి ప్రతి రోజూ 12 గంటలకు అందుబాటులో ఉంటామన్నారు. పరిస్థితి సమ్మె వరకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. పీఆర్సీ సాధన సమితి నేతలే కాదు.. మిగిలిన ఉద్యోగ సంఘాల నేతలెవరు వచ్చిన చర్చలకు సిద్దమన్నారు. చర్చలకు రమ్మనే మేం కోరుతున్నామని సజ్జల వెల్లడించారు. బాధ్యత కలిగిన నేతలు ఇమ్మెచ్యూర్ గా వ్యవహరించడం మంచిది కాదన్నారు.
16:18 IST, Jan 27 2022
చర్చలకు రండి.. మీరు మా శత్రువులు కాదు.. ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల సూచన
13:10 IST, Jan 27 2022
క్రొత్త PRC ప్రకారము జనవరి నెల జీతాలు చేయాలని Fin Dept వారు HOD & Secretaries & DDO &STO/PAOలను ఆదేశిస్తూ మెమో జారీ. ఈ మెమో ప్రకారము జీతాలు చేయని DDO, STO, PAOలపై CCA రూల్స్ ప్రకారము, Competent Authorities క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని తాజాగా ఆదేశాలు జారీ.
10:16 IST, Jan 27 2022
పి.ఆర్.సి. సాధన సమితి తో ఈ రోజు మరో దఫా చర్చలు జరపనున్న ప్రభుత్వం.
10:14 IST, Jan 27 2022
పి.ఆర్.సి. సాధన సమితి ఆధ్వర్యంలో ఈ రోజు నుండి రిలే నిరాహార దీక్షలు.
05:52 IST, Jan 27 2022
PRC Sadhana Samithi - District Observers PRC Sadhana Samithi - District Observers
05:50 IST, Jan 27 2022
PRC Struggle Committee - Tour ProgramTour Programm During Hunger Strike
20:01 IST, Jan 25 2022
ప్రభుత్వశాఖల్లో, యూనివర్సిటీల్లో, సొసైటీల్లో, మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ ప్రకారం జనవరి 2022 జీతాన్ని ఫిబ్రవరిలో డీడీవోల నుంచి చెల్లించాలని ఆర్థిక శాఖ జారీ చేసిన మెమోలో పేర్కొంది. ప్రభుత్వశాఖల్లో పని చేస్తున్న పొరుగుసేవల ఉద్యోగులకు జనవరి 2022 జీతాన్ని ఫిబ్రవరి 2022న డీడీవోల ద్వారా చెల్లించాలని చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల పే బిల్లులు ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం payroll.herb.apcfss.in ద్వారా ప్రభుత్వం సూచించిన నిబంధనలు మేరకు ఎలాంటి డీవియేషన్ లేకుండా చెల్లించాలని స్పష్టం చేసింది. మిగిలిన కేటగిరి ఉద్యోగులు అందరికీ సీఎఫ్‌ఎమ్‌ఎస్, ఆప్‌కోస్ ద్వారా రివైజిడ్ పే స్కేల్స్‌ను పీఆర్‌సీ జీవో ప్రకారం అందించాలని ఆర్థిక శాఖ అదేశించింది. ట్రెజరీ ఆఫీసుల్లోని డిస్బర్సింగ్ ఆఫీసర్లు ఈ సూచనలు పాటిస్తూ జీతాలు చెల్లింపు ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఎస్.ఎస్.రావత్ ఉత్తర్వులు జారీ చేశారు
20:01 IST, Jan 25 2022
ఏపీ సచివాలయం, హెచ్‌వోడీలు, ట్రెజరీలు, అకౌంట్స్ అండ్ పే, డీడీవోలకు ఆర్ధికశాఖ మెమో జారీ చేసింది. 2022 జనవరి శాలరీని ఉద్యోగులకు సంబంధిత డీడీవోల ద్వారా రివైజిడ్ పే స్కేల్ 2022ను అనుసరించి చెల్లించాలని ఆదేశించింది. జనవరి 2022 రివైజిడ్ కంసాలిడేటెడ్ పెన్షన్, బెనిఫిట్‌లను డీడీవోల ద్వారా చెల్లించాలని సూచించింది.
17:39 IST, Jan 25 2022
RPS 2022 (11 వ PRC) అమలుకు సంబంధించి.....ఈ రోజు మధ్యాహ్నం 2.00 గంటల వరకు HERB దరఖాస్తు ద్వారా ఎంతమంది ఉద్యోగుల వేతన స్థిరీకరణ జరిగినదీ ?.... ఎంతమంది DDO లు సదరు డేటా అప్ లోడ్ చేసారు?.... ఎంతమంది STO లు confirm చేసారు ?... తదితర వివరాలను నిర్ణీత ప్రొఫార్మా లో సమర్పించవలసిందిగా అందరు ఉప సంచాలకులను , జిల్లా ఖజానా అధికారులను కోరుతూ ఖజానా & పద్దుల శాఖ రాష్ట్ర సంచాలకులు మెమో జారీ చేసారు.
17:38 IST, Jan 25 2022
రేపు PRC సాధన సమితి ఆధ్వర్యంలో ర్యాలీ అనంతరం డా.బి.ఆర్. అంబెడ్కర్ గారి విగ్రహానికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం.
17:30 IST, Jan 25 2022
మంత్రుల కమిటీ తో స్టీరింగ్ కమిటీ భేటీలో చర్చలకు రావాలంటే (27 వతేదికి)పెట్టిన షరతులు: 1) ఆశితోష్ కమిటీ రిపోర్ట్ విడుదల చేయ్యాలి, 2) జనవరికీ పాత జీతాలే ఇవ్వాలి, 3) PRC జివోలు రద్దుచేయాలి...వీటికి ఒకే అయితేనే చర్చలకు మా నాయకులు వస్తారని మంత్రుల కమిటీ కి తెలిపిన స్టీరింగ్ కమిటీ నాయకులు. PRC జీవోను రద్దు చేయాలని కోరాం, తదుపరి కార్యాచరణ కొనసాగుతుంది స్టీరింగ్ కమిటీ సభ్యులు.
17:21 IST, Jan 25 2022
సజ్జల కామెంట్స్ : ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమే. ఫిట్మెంట్ పై నిర్ణయం జరిగిపోయింది. మిగతా విషయాలపై చర్చలు ఉంటాయి.
17:15 IST, Jan 25 2022
జీవోలను వెనక్కి తీసుకోవాలనడం సరికాదు : సజ్జలఒకసారి జారీ చేసిన జీవోలను వెనక్కి తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేయడం సరికాదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు . ఏదీ అడగకుండానే సీఎం జగన్ ఇచ్చారని చెప్పారు . అమరావతిలో మంత్రులు బొత్స సత్యనారాయణ , పేర్ని నానితో కలిసి సజ్జల మీడియాతో మాట్లాడారు.నిన్నటిలాగే మంత్రుల కమిటీ నేడు కూడా ఎదురుచూసిందని ఆయన చెప్పారు . ఉద్యోగ సంఘాల నేతలు ఆలస్యంగా వచ్చినా వేచి చూశామన్నారు . స్టీరింగ్ కమిటీ నేతలు వచ్చి కలిశారని .. పీఆర్సీ జీవోలు నిలుపుదల చేయాలని కోరారన్నారు . ఇంతకాలం చేసిన ప్రక్రియను తిరగతోడటం సరికాదని .. ఏమైనా మార్పులు ఉంటే వాటి గురించి మాట్లాడేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని చెప్పారు . ఈనెల 27 న మళ్లీ చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాలను కోరినట్లు సజ్జల తెలిపారు .
11:37 IST, Jan 25 2022
సచివాలయం లో మంత్రుల కమిటీ ని కలిసి పాత జీతాలే ఇవ్వాలని ,PRC జీవో లు రద్దు చేయాలని కోరిన PRC సాధన సమితి స్టీరింగ్ కమిటీ. ఏ విధమైన ఫలితం లేకుండానే ముగిసిన మంత్రుల కమిటీ తో PRC సాధన సమితి స్టీరింగ్ కమిటీ భేటీ ఈ నెల 27 తేదిన మరోసారి చర్చలు.
06:19 IST, Jan 25 2022
పి.ఆర్.సి సాధన సమితి కార్యాచరణ లో భాగంగా ఈ రోజు జిల్లా హెడ్ క్వార్టర్ లలో ర్యాలీలు చేపట్టే కార్యక్రమం.
17:14 IST, Jan 24 2022
జి.ఏ.డి కార్యదర్శి కి సమ్మె నోటీసు అంద చేతప్రధాన కార్యదర్శి అందుబాటు లో లేని కారణంగా సచివాలయంలో అందుబాటులో ఉన్న GAD ముఖ్య కార్యదర్శి శశి భూషణ్ కుమార్ గారికి సమ్మె నోటీసు అందజేసిన PRC సాధన సమితి నేతలు.
15:10 IST, Jan 24 2022
ఉద్యోగులను మరోసారి చర్చలకు ఆహ్వానించిన మంత్రులు. ససేమిరా అన్న ఉద్యోగ సంఘాలు. జీవో ల రద్దు తర్వాతే చర్చలు అని బదులు ఇచ్చిన సంఘ నాయకులు
12:56 IST, Jan 24 2022
జీతాలు తగ్గించే హక్కు ప్రభుత్వానికి ఉంది అని వ్యాఖ్యానించిన హైకోర్టు. జీతాలు అంకెల్లో తగ్గాయో లేదా పెరిగాయి తెలపాలని ఉద్యోగుల ను ఆదేశించిన హైకోర్టు.
17:15 IST, Jan 23 2022
పి.ఆర్.సి సాధన కమిటీ ని చర్చలకు ఆహ్వానించిన మంత్రి వర్గ బుజ్జగింపుల కమిటీ.. జీవో ల రద్దు చేసాకే చర్చలకు వస్తామని బదులిచ్చిన పి.ఆర్.సి సాధన సమితి
17:13 IST, Jan 23 2022
అన్ని ఉద్యోగ సంఘాలు కలిసి పి.ఆర్.సి సాధన సమితి గా ఏర్పాటు. ఈ నెల 24న సి.ఎస్ కు సమ్మె నోటీసు ఇవ్వనున్న ఉద్యోగ సంఘాలు.
17:11 IST, Jan 23 2022
మంత్రి వర్గ సమా వేశం లో పి.ఆర్.సి జీ.వో లకు ఆమోదం... ఉద్యోగులకు నచ్చ చెప్పడానికి కమిటీ నియామకం
17:10 IST, Jan 23 2022
అన్ని ఉద్యోగ సంఘాలు ఏక తాటికి వస్తూ సమ్మె దిశ గా పయనం
17:09 IST, Jan 23 2022
ఫ్యాప్టో ఆధ్యర్యం లో 20 వ తేదీన చేపట్టిన కలెక్టరేట్ల ముట్టడి విజయవంతం. ఉద్యోగుల తాకిడి తో ఉలిక్కి పడ్డ ప్రభుత్వం.
20:35 IST, Jan 22 2022
ఉద్యోగులకు ఏ మాత్రం ఉపయోగ పడని పి.ఆర్.సి ఉత్తర్వులు రాత్రికి రాత్రి జారీ..
17:24 IST, Nov 11 2021
పీఆర్సీ నివేదికను ప్రభుత్వం ఎందుకు దాచిపెడుతుందో అర్ధం కావడం లేదు. పీఆర్సీ నివేదికను మేమూ స్టడీ చేయాలి. మా డిమాండ్లు ఆ నివేదికలో ఉందో లేదో మాకూ తెలియాలి కదా..?పీఆర్సీని వెంటనే అమలు చేసే ఆలోచన ప్రభుత్వానికి ఉందా..? లేదా..? - బొప్పరాజు, ఏపీ అమరావతి జేఏసీ ఛైర్మన్
17:20 IST, Nov 11 2021
నా చేతుల్లో ఏం లేదు.. సీఎం, సీఎస్ చేతుల్లోనే అంతా ఉందని జే ఏ సి నాయకులకు శశిభూషణ్ స్పష్టంగా చెప్పారు.
17:02 IST, Nov 11 2021
బొప్పరాజు ఏం మాట్లాడారో ఆ వివరాలు...పీఆర్సీ నివేదికను ప్రభుత్వం ఎందుకు దాచిపెడుతుందో అర్ధం కావడం లేదు.మా డిమాండ్లకు చోటుకల్పించారో లేదో తెలియాలి.పీఆర్సీ అమలు చేసే ఆలోచన ప్రభుత్వానికి ఉందో లేదో స్పష్టం చేయాలి.రేపటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో మాకు పి ఆర్ సి అమలు డిమాండే ముఖ్యాంశం
17:02 IST, Nov 11 2021
జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో సభ్య సంఘాల వివరాలు ఇవ్వాలని కూడా కోరినట్లు బొప్పరాజు, బండి శ్రీనివాసరావు తెలిపారు. పీఆర్సీ నివేదిక విషయంలో ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని శశి భూషణ్ కుమార్ వెల్లడించినట్లు వారు చెప్పారు. గవర్నమెంట్ ఉద్యోగుల ఫెడరేషన్ నేత వెంకట్ రామ్ రెడ్డి ని కూడా తమతో కలవాలని కోరినట్లు చెప్పారు.
17:02 IST, Nov 11 2021
పిఆర్సి నివేదికను తక్షణం బయట పెట్టేది లేదని పిఆర్సి నివేదికను తక్షణం బయట పెట్టేది లేదని, రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులు విభాగం కార్యదర్శి శశిభూషణ్ కుమార్ పేర్కొన్నారు. సచివాలయంలో బుధవారం ఆందోళన నిర్వహించిన ఏపీ ఎన్జీవో నాయకులు, అమరావతి జేఏసీ నాయకులను ఆయన గురువారం పిలిచి మాట్లాడారు. పీఆర్సీ నివేదిక విషయంలో ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తమకు చెప్పినట్లు ఉద్యోగ సంఘ నేతలు మీడియాకు వెల్లడించారు. శశి భూషణ్ కుమార్ తో సమావేశం అనంతరం ఎన్జీవో నేత బండి శ్రీనివాసరావు, అమరావతి జేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. పిఆర్సి నివేదికను ప్రభుత్వం ఎందుకు బయట పెట్టడం లేదో తమకు తెలియడం లేదన్నారు. అసలు పిఆర్సి అమలు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా లేదా అని వారు ప్రశ్నించారు.
15:08 IST, Nov 11 2021
PRC నివేదికపై చర్చించేందుకు రేపు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని సర్కారు నిర్ణయించింది.
ఇందులో పీఆర్సీ నివేదిక, ఫిట్‌మెంట్ పై సీఎం జగన్ ఇచ్చిన ఆదేశాలను సీఎస్ ఉద్యోగ సంఘాలకు వివరించనున్నారు. కాగా, పీఆర్సీ నివేదికపై కొన్ని ఉద్యోగ సంఘాల విమర్శలు బాధాకరమని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామి రెడ్డి అన్నారు.
రేపటి సమావేశం తర్వాత పీఆర్సీపై క్లారిటీ వస్తుందన్నారు.
14:21 IST, Nov 11 2021
Sub: Meetings Intimation - AP Civil Services Joint Staff Council - (APCSJSC) scheduled to be held on dated 12-11-2021 at 2.00 pm In the Conference Hall, 1st Floor, 5th Block, A.P. Secretarlat, Velagapudi - Reg.***"It is to Inform that as a follow up to the discussions held during the meeting of AP Civil Services Joint Staff Council (APCSJSC) on 29-10-2021, Principal Finance Secretary (PFS) decided to convene a meeting with the Member, Services' Associations of Joint Staff Council to discuss issues/ grievances related to employees.You are, therefore, requested to attend the above mentioned meeting on Friday, 12th November, 2021 at 2.00 pm at Conference Hall, 1st Floor, 5th Block, AP Secretariat, Velagapudi.***
14:01 IST, Nov 11 2021
ఇక, గత నెల 29న పీఆర్సీ నివేదిక ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పటికీ ఇవ్వలేదని విమర్శించారు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, పీఆర్సీ రిపోర్టుపై అధికారులు స్పష్టత ఇవ్వలేదన్న ఆయన.. రిపోర్ట్ ఇవ్వకుండా పీఆర్సీపై మేం మాట్లాడబోమని స్పష్టం చేశారు.. ఉద్యోగ సంఘాల వినతి మేరకే సీఎస్ పీఆర్సీపై సీఎంను కలిశారు.. అధికారులు, ప్రభుత్వంపై కొన్ని ఉద్యోగ సంఘాలు చేస్తున్న విమర్శలు బాధాకరం అన్నారు.. మైలేజ్ కోసం కొన్ని ఉద్యోగ సంఘాలు పోరాటాలు చేస్తున్నాయని మండిపడ్డ ఆయన.. పీఆర్సీపై ఉద్యోగులకు ఒక క్లారిటీ ఉందన్నారు. మరి పీఆర్సీపై రేపైనా స్పష్టత వస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
14:01 IST, Nov 11 2021
పీ ఆర్ సి నివేదిక విడుదల చేయాలంటూ సచివాలయంలోని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మను కలిసిన ఉద్యోగ సంఘాల నేతలు.. పీఆర్సీ నివేదిక బహిర్గతం చేసే వరకు ఇక్కడి నుంచి కదలబోమంటూ ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే.. సీఎంను కలిసి సీఎస్ చర్చించిన తర్వాత నివేదిక విడుదల చేస్తారని భావించినా ఉద్యోగ సంఘాలకు నిరాశ ఎదురైంది.. అయితే, పీఆర్సీ ప్రక్రియ ప్రారభమైందని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.. మరోవైపు రేపు పీఆర్సీపై స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఎందుకంటే.. *రేపు మరోసారి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం కానుంది*… ఉద్యోగ సంఘాల ఆందోళనతో మళ్లీ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. పీఆర్సీ నివేదిక అందజేత, ఫిట్మెంట్, ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీలో ప్రభుత్వం చర్చించనుంది.
13:14 IST, Nov 11 2021
ఉద్యోగుల సమస్యలపై వారికి క్లారిటీ ఉంది. ఒక సంఘం ఆరోపణలు అభ్యంతరకరం, అన్ని సమస్యలు పరిష్కారం చేయబడతాయి - ప్రభుత్వ సలహాదారు వెంకట్రామరెడ్డి
13:06 IST, Nov 11 2021
రేపటి సమావేశం లో పీ ఆర్ సి, ఫిట్మెంట్ తదితర ప్రధాన సమస్యలపై చర్చ
13:04 IST, Nov 11 2021
ఉద్యోగుల ఆందోళన తో రేపు సమావేశం నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయం.
13:03 IST, Nov 11 2021
రేపు మధ్యాహ్నం భేటీ అనంతరం పీ ఆర్ సి పై క్లారిటీ
13:02 IST, Nov 11 2021
రేపు మధ్యాహ్నం అధికారులతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీ
10:49 IST, Nov 11 2021
ప్రభుత్వం నుండి ఉద్యోగ సంఘాల నాయకులు కు పిలుపు ఉద్యోగ సంఘాల నేతలకు ప్రభుత్వం నుంచి పిలుపు. నేతలను సచివాలయంలో భేటీకి రమ్మన్న అధికారులు. ఉదయం 11 గంటల తర్వాత జేఏడీ సర్వీసెస్ సెక్రటరీని కలిసే అవకాశం. పీఆర్సీ నివేదిక ఇస్తారా ? లేదా ? అన్న అంశంపై ఇప్పటికీ కనిపించని స్పష్టత. ప్రభుత్వ పిలుపు మేరకు జీఏడీ అధికారుల వద్దకు వెళ్లాలని నిర్ణయం. ప్రభుత్వం నుంచి వచ్చే స్పందనను బట్టి ఇరు జేఏసీలు భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించే అవకాశం.
10:32 IST, Nov 11 2021
ఈ నేపథ్యంలో లో ప్రభుత్వ పిలుపుఈ నేపథ్యంలో లో ప్రభుత్వం నుండి ఉద్యోగ సంఘ నాయకులకు ప్రభుత్వం నుండి పిలుపు రావడం గమనార్హం.
10:30 IST, Nov 11 2021
హెచ్చరికప్రభుత్వ వైఖరి తో విసుగు చెందిన ఉద్యోగ సంఘ నాయకులు ఈ రోజు తమ కార్యాచరణ ప్రకటిస్తాం అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
10:28 IST, Nov 11 2021
పి ఆర్ సి నివేదిక కోసం పట్టునిన్న పి.ఆర్.సి రిపోర్ట్ కోసం ఎదురు చూసి ఉద్యోగ సంఘ నాయకులు దాదాపు 5 గంటలు సచివాలయం వద్దే ఎదురు చూసి వెనుదిరిగి విషయం మీకు తెలిసిందే...
10:17 IST, Nov 11 2021
Source TV9 స్క్రోల్ఫ్లాష్ ఫ్లాష్ ....ప్రభుత్వం నుండి ఉద్యోగ సంఘాల నాయకులు కు పిలుపు
12:23 IST, Nov 07 2021
ప్రభుత్వ ఉద్యోగుల PRC పై ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయంPRC నివేదిక విడుదలకు అంగీకరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు. సోమవారం సాయంత్రం PRC నివేదికను విడుదల చేయనున్న శశిభూషన్ కుమార్ (Pre. Secretary General Admission Dept.). PRC నివేదిక ప్రతులను 13 ఉద్యోగ సంఘాలకు అందజేయనున్నట్లు తెలిపిన ప్రభుత్వం. నివేదికలోని అంశాలపై ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపనున్న ఏపీ ప్రభుత్వం. ఈనెల 17వ తేదీ నుంచి జరిగే అసెంబ్లీ శీతాకాల సమావేశాలలో PRC పై ప్రకటన చేయనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు.
07:23 IST, Nov 06 2021
ప్రభుత్వం ప్రకటించే పీఆర్సీ ఏ రకంగా ఉంటుందనేది ఉత్కంఠముఖ్యమంత్రి గారి పరిశీలన పూర్తయిన తరువాత ఈనెల 8వ తేదీన పీఆర్సీ నకలు కాపీ లను ఉద్యోగ సంఘాలకు పంపుతామని సీఎస్ గారు హామీ ఇచ్చినట్లు సమాచారం. ఫిట్మెంట్ కు, ఐఆర్కు ఉన్న వ్యత్యాసాన్ని బేరీజు వేసుకున్న తరువాత తదుపరి కార్యాచరణ చేపట్టనున్నట్లు జేఏసీల నేతలు తెలిపారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం హైదరాబాద్ నుంచి వచ్చిన ఉద్యోగులకు 30 శాతం హెచ్ఐర్ఎ, స్థానికులకు 20 శాతం అమలు చేస్తోంది. తెలంగాణలో హెచ్ఎర్ఎ తగ్గించిన నేపథ్యంలో రాష్ట్రంపై కూడా ఆ ప్రభావం చూపే అవకాశం లేకపోలేదని ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ప్రభుత్వం ప్రకటించే పీఆర్సీ ఏ రకంగా ఉంటుందనేది ఉత్కంఠభరితంగా మారింది.
07:23 IST, Nov 06 2021
పీఆర్సీ, సీపీఎస్ రద్దు. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంపుఇక జేఏసీల ప్రధాన డిమాండ్లలో పీఆర్సీ, సీపీఎస్ రద్దు. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంపు, పెండింగ్లో ఉన్న బకాయి లు, పెన్షనర్ల ఆర్థిక సమస్యల పరిష్కారం తదితర అంశాలు ఉన్నాయి. వీటిలో కూడా ప్రధానంగా వేతన సవరణకే పట్టుపడుతున్నాయి. ఇందులో భాగంగా ఏపీజేఏసీ, జేఏసీ- అమరావతి నేతలు బండి శ్రీనివాసరావు, బొప్ప రాజు వెంకటేశ్వర్లు తదితర నేతలు శుక్రవారం సచివాల యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ గారితో మరోసారి భేటీ అయ్యారు. పీఆర్సీ నివేదికను అందించా లని విజ్ఞప్తి చేశారు.
07:22 IST, Nov 06 2021
ఉద్యోగ సంఘాలు పట్టుగత 8 నెలలుగా ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీజీఎల్బీ, జీపీఎఫ్, మెడికల్ రీ యింబర్స్ మెంట్ తో పాటు పెన్షనర్లకు గ్రాట్యుటీ, ఇతర ప్రోత్సాహకాలు చెల్లింపులు జరగలేదు. దీంతో పాటు ప్రభుత్వం గత ఏడాది విడతల వారీగా డీఏ బకాయిలను తీరుస్తామని ప్రకటించింది. ఉద్యోగుల కోర్కె లు న్యాయపరమైనవే అయినప్పటికీ ఇవన్నీ నెరవేరాలంటే తలకు మించిన భారమవుతుందని ఆర్థికశాఖ అంచనాలు వేస్తోంది. అయితే ఒకే విడత అన్నిరకాల చెల్లింపులు జరపా లని తాము డిమాండ్ చేయటంలేదని ముందుగా ఓ నిర్ణయం తీసుకుని ఆపై షెడ్యూల్ ప్రకటిస్తే ఉద్యోగులకు వెసులుబాటు కలుగుతుందని జేఏసీల నేతలు వాదిస్తున్నా ఉద్యోగ సంఘాల డిమాండ్లలో భాగంగా కోవిడ్ కార మృతిచెందిన ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి కారు ణ్య నియామకాల ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణ యించింది. అయితే ఇందులో విధి నిర్వహణలో సహజ మరణం పొందిన వారి కుటుంబాలకు కూడా అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు పట్టుపడుతున్నాయి.
07:21 IST, Nov 06 2021
ముఖ్యమంత్రి గారితో సీఎస్ గారి భేటీ అనంతరం పీఆర్సీపై తుది నిర్ణయం తీసుకునే అవకాశాలుగత నెలాఖరు కల్లా పీఆర్ సీని బహిర్గతం చేస్తామని వెల్లడించారు. అయితే సాధారణ సెలవులు, ఇతరత్రా కారణాల వల్ల వాయిదా పడింది. ముఖ్యమంత్రి గారితో సీఎస్ గారి భేటీ అనంతరం పీఆర్సీపై తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో 2014-18కి 43 శాతం ఫిట్ మెంట్ను అమలు చేసింది. అయితే ప్రస్తుత ప్రభుత్వం ముందుగానే అమలు చేస్తున్నందున పీఆర్సీ కార ణంగా అదనపు భారంపడే అవకాశం లేదని చెప్తున్నారు. గత రెండేళ్లుగా కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సన్నగిల్లింది. పరిధికి మించి రుణసేకర ణ జరిపే పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థికేతర అంశాలు తప్ప మిగిలిన వాటిపై ఎలాంటి నిర్ణ యం తీసుకోరాదని ఆ శాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వాని కి సూచిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మో హన్ రెడ్డి గారు మాత్రం ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లను ముందుగా పరిష్కరించే దిశగా ఆలోచనలు జరుపుతున్నా రు.
07:20 IST, Nov 06 2021
ఈనెల 8వ తేదీన ముఖ్యమంత్రి గారికి వివరణపీఆర్సీ నివేదికను గత సీఎస్ ఆదిత్యనాథ్ గారు ప్రభుత్వానికి సమర్పించారు. అయితే గత కొద్దిరోజులుగా ఉద్యోగ సంఘాల జేఏసీల ఆందోళన నేపథ్యంలో దీనిపై ముఖ్యమంత్రి గారికి వివరించేందుకు ఈనెల 8వ తేదీన ముఖ్యమంత్రి గారికి వివరించను న్నారు. అదే రోజు పీఆర్సీ నివేదికను ఉద్యోగ సంఘాలకు అందజే సేందుకు కసరత్తు జరుపు తున్నారు. గత నెల 29వ నిర్వహించిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావే శంలోనే ఈ మేరకు సీఎస్ గారు హామీ ఇచ్చారు.
07:19 IST, Nov 06 2021
11వ వేతన సవరణ సిఫార్సులపై ప్రభుత్వం త్వరలో నిర్ణయంప్రభుత్వ ఉద్యోగులకు 11వ వేతన సవరణ సిఫార్సులపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. 2018 జూలై నుంచి పీఆర్ని ప్రకటించాల్సి ఉంది. అయితే ప్రభుత్వం 27 శాతం మధ్యంతర భృతి అమలు చేస్తున్న నేపథ్యంలో పీఆర్సీలో పెద్దగా వ్యత్యాసం కనిపించకపోయినా హౌస్లెంట్ అలవెన్స్ (హెచ్ఎర్ఎ), ఇతర రాయితీలపై ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
17:21 IST, Nov 04 2021
What will do Bandi దీపావళి కి పి.ఆర్.సి ప్రకటించక పోతే, భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఏ.పి ఎన్.జీ.వో నాయకులు ఇప్పటికే ప్రకటించారు. మరి ఈ రోజు ప్రకటన రానందున సంఘ నాయకులు ఏ విధమైన కార్యాచరణ ప్రకటిస్తారో వేచి చూడాలి.
17:20 IST, Nov 04 2021
No PRC దసరా వచ్చింది, వెళ్ళింది. దీపావళి వచ్చింది, వెళ్ళింది. కానీ పి.ఆర్.సి ప్రకటనే లేదు. దీనితో ఉద్యోగులు తీవ్ర నిరాశకు గురి అవుతున్నారు.
07:07 IST, Nov 02 2021
దీపావళి నాటికి పిఆర్‌సి ప్రకటించకపోతే ఉద్యోగులతో కార్యాచరణఉద్యోగుల సంక్షేమ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు శ్రీ ఎన్.చంద్ర శేఖర రెడ్డి అభినందన సభలో ఎపి ఎన్‌జిఒ రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాసరావు, కెవి శివారెడ్డి మాట్లాడుతూ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో పిఆర్‌సి, డిఎ, సిపిఎస్ రద్దు పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలిపారు. నెలాఖరులోవు పిఆర్‌సి ని ప్రకటిస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి హామీ ఇచ్చారని, దీపావళి నాటికి పిఆర్‌సి ప్రకటించకపోతే ఉద్యోగులతో కార్యాచరణ రూపొందిస్తామన్నారు.
07:06 IST, Nov 02 2021
పిఆర్‌సి వీలైనంత త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుందిరాష్టంలో ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య వారధిలా పనిచేస్తానని ఎపిఎన్‌జిఒ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎన్ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు అన్ని సంఘాలనూ సమన్వయం చేసుకుని ముందుకెళ్లానని పేర్కొన్నారు. ఉద్యోగ ఉద్యమంలో 30 ఏళ్లకు పైబడి పనిచేసిన ఎన్ చంద్రశేఖర్‌రెడ్డి తన ఉద్యోగ సర్వీసు నుంచి ర్షిటైర్దు కాగానే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. ఈ మేరకు విజయవాడలోని ఎపిఎన్‌జిఒ రాష్ట్ర కార్యాలయంలో అభినందన కార్యక్రమం సోమవారం ఏర్పాటు చేశారు. పలువురు ఎపి జెఎసి, ఎపిఎన్‌జిజ నాయకులు చంద్రశేఖర్‌రెడ్డిని అభినందించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. పిఆర్‌సి వీలైనంత త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుందని అన్నారు
11:26 IST, Oct 31 2021
ఏపీ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షు డు సామల సింహాచలం విజ్ఞప్తిప్రస్తుతం ఉన్న ధరల సూచీ, అదేవిధంగా భవిష్యత్తులో ఎనిమిదేళ్ల కాలం పాటు పెరగబోయే ధరలకు అనుగుణంగా పీఆర్సీ సిఫార్సులు ఉండాలే కానీ, ఉద్యోగులు నష్టపోయే రీతిలో సిఫార్సులు చేయడం ఎంతమాత్రం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. కనుక రాష్ట్రంలో గల లక్షలాదిమంది ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల అభిమానాన్ని చూర గొనేలా గత ప్రభుత్వం కన్నా మెరుగైన ఫిట్మెంట్ను సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించాలని ఏపీ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షు డు సామల సింహాచలం విజ్ఞప్తి చేసారు.
11:24 IST, Oct 31 2021
పీఆర్సీ ఫిట్మెంట్ 50 శాతం తగ్గకుండా ఉండాలి11వ పీఆర్సీలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు కనీసం 50 శాతం తగ్గకుండా ఫిట్మెంట్ ప్రకటిం చాలని ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యా య సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షు డు సామల సింహాచలం, ప్రధాన కార్యదర్శి మేకల శివార్జున శనివారం ఒక ప్రకటనలో కోరారు.
10:50 IST, Oct 31 2021
PRC Note: పిఆర్సీ పై ఒక నోట్ ఇచ్చారంతే " పిఆర్సి పై 27 శాతం ఫిట్మెంట్ తో ఒక నోట్ మాత్రమే ఇచ్చారు. అంతకుమించి ఎలాంటి స్పష్టత లేదు. వారం రోజుల్లో కమిటీ వేస్తామన్నారు." అని ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు. పెన్షన్లు జీతాల పై కూడా ఇలాంటి స్పష్టత ఇవ్వలేదన్నారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యోగు లకు రావలసిన బకాయిలు పై కూడా ఇలాంటి స్పష్టత ఇవ్వలేదన్నారు. ఈ సమావేశం పై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఉద్యోగులు, వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల సమస్యలపై కార్యదర్శులతో వచ్చేనెల 30 లోపు సమావేశం ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారని బొప్పరాజు వివరించారు. కారుణ్య నియామకాల విషయంలో ముఖ్యమంత్రి జగన్ ఆదేశించినా అధికారులు పట్టించుకోవడం లేదని సీఎస్ కు చెప్పామన్నారు. వారం రోజుల్లో పిఆర్సి పై స్పష్టత రాకపోతే తమ కార్యాచరణ ప్రకటిస్తామని బొప్పరాజు వెల్లడించారు.
10:49 IST, Oct 31 2021
Demand For PRC Report: పీఆర్సీ పూర్తి స్థాయి నివేదిక బయట పెట్టాల్సిందేజాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ముగిసే లోపే పీఆర్సీ పూర్తిస్థాయి నివేదికను బయటపెట్టాలని ఉద్యోగ సంఘాల నేతలు పట్టుబట్టారు. పీఆర్సీ అమలు సిపిఎస్ రద్దు తదితర డిమాండ్లతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ అధ్యక్షతన జరిగింది.
10:49 IST, Oct 31 2021
PRC Basic Pay in New Scales Formula Information: కొత్త స్కేల్లో ఉద్యోగుల మూల వేతనం...ప్రభుత్వ నోట్ సారాంశం పీఆర్సీ నివేదికను ప్రభుత్వం పూర్తిస్థాయిలో వెల్లడించలేదు. ఒక పేజీ మాత్రమే విడుదల చేసింది. అందులో ఫిట్మెంట్ ఎంత ఉండాలో, డీఏ ఎంత ఉండాలో సిఫార్సు చేసింది
10:48 IST, Oct 31 2021
PRC Fitment 23% Proposed: పి.ఆర్.సి ఫిట్మెంట్ 23 శాతం ను ప్రతిపాదించిన ప్రభుత్వం ఈ రోజు అనగా ది.29.10.2021 న జరుగుతున్న జాయింట్ స్టాఫ్ కౌంసిల్ మీటింగ్ లో ఇచ్చిన బ్రీఫ్ రిపోర్టు లో 23% ఫిట్మెంట్ ను ప్రతిపాదించిన ప్రభుత్వం
10:48 IST, Oct 31 2021
PRC Demand: పీఆర్సీ పై తేల్చకపోతే స్టాఫ్ కౌన్సిల్ బహిష్కారం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ అధ్యక్షతన నిర్వహిస్తున్న ఉద్యోగ సంఘాల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం వాడివేడిగా జరగనుంది. ఈ సమావేశంలో ఎలాంటి వ్యూహం అనుసరించాలి అనే అంశంపై కొద్దిసేపటి క్రితం ఎన్జీవో సంఘం ఆధ్వర్యంలో జేఏసి విజయవాడలో సమావేశమయింది. పీఆర్సీ నివేదిక బయటపెట్టి తక్షణమే అమలు ప్రక్రియ ప్రారంభించాలని గట్టిగా డిమాండ్ చేయాలని వీరు నిర్ణయించారు. తొలుత పిఆర్సి పైనే పట్టు పట్టాలని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. పీఆర్సీ నివేదిక వెంటనే బయటపెట్టాలని తొలుత వీరు డిమాండ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఒకవేళ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేకుంటే గట్టి నిర్ణయం తీసుకోవాలని నిశ్చయానికి వచ్చారు. పీఆర్సీ నివేదిక బయట పెట్టకపోతే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం బహిష్కరించి బయటకు వచ్చేందుకు వెన కాడ వద్దని నిర్ణయించుకున్నారు. అమరావతి జేఏసీ సైతం వీరితో కలిసి వెళుతున్నందున వారు కూడా ఇదే వ్యూహానికి మద్దతు పలకనున్నారు. అక్కడి పరిస్థితులకు అనుకూలంగా ఈ వ్యూహం అమలు చేయాలని రెండు జేఏసీలు నిర్ణయించాయి. ఈ వ్యూహం మేరకే సమావేశం ప్రారంభమైన వెంటనే బండి శ్రీనివాసరావు పిఆర్సి నివేదిక కోసం పట్టుబట్టారు.
10:47 IST, Oct 31 2021
PRC Proposals with in 3 Days: మూడు రోజుల్లో పీఆర్సీ నివేదిక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ కమిషన్ నివేదిక ను పూర్తిగా మూడు రోజుల్లో బయట పెడతామని ప్రభుత్వం ప్రకటించింది. వెలగపూడి సచివాలయం లో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభమైంది. ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ పీఆర్సీ నివేదిక బయట పెడితేనే సమావేశంలో ఉంటామని లేకుంటే బహిష్కరిస్తామని ప్రకటించారు. సమావేశం అయిన తర్వాత నివేదిక వెల్లడిస్తామని చెప్పిన సి ఎస్ మూడు రోజుల్లో పూర్తి పిఆర్సి నివేదిక బయటపెడతామని స్పష్టంగా ప్రకటించారు.
10:47 IST, Oct 31 2021
No PRC No DA: పీఆర్సీ లేదు.. డీఏలు రావు పీఆర్సీ ఒక ఏడాది ఆలస్యమవడం సహజం. ఇప్పుడు మూడేళ్లా నాలుగు నెలల నుంచీ పెండింగ్‌లోనే ఉంది. డీఏలు అందడంలేదు. 15వ తేదీ దాకా పెన్షన్లు వేస్తూనే ఉన్నారు. అధికారంలోకి వచ్చిన వారంలో సీపీఎస్ రద్దు చేసి... పాత పెన్షన్ అమలు చేస్తామన్నారు. అయినా పట్టించుకోలేదు. చివరికి... ఒకటో తేదీన జీతం వస్తే చాలనుకునే పరిస్థితి వచ్చింది!
10:46 IST, Oct 31 2021
29-10-2021 న జరగబోయే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ ఎజెండా విడుదల Scrap CPS- Restore OPS- Fulfill Hon'ble CM promise, Settlement of 11th PRC, పలు అంశాలతో డిపార్ట్మెంట్ ల వారీ గా ఎజెండా విడుదల
10:45 IST, Oct 31 2021
AP JAC Press note మరియు AP JAC అమరావతి ఐక్యవేదిక ఇరు JAC ల ఐక్యవేదికతో తేదీ 13/10/21 న గౌరవ శ్రీ సజ్జల రామకృష్ణా రెడ్డి గారు, CMO ఉన్నతాధికారులు ఇచ్చిన హామీ మేరకు ఈ రోజు అనగా 21 వ తేదీన అందరూ కార్యదర్శుల సమావేశం ఏర్పాటు చేయడం, అలాగే ఈ నెల 27 వ తేదీన అన్నీ సంఘాలతో రాష్ట్ర స్థాయి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయడం సంతోషం.
10:44 IST, Oct 31 2021
AP PRC Fitment: పీఆర్‌సీ నివేదికలో 27% ఫిట్‌మెంట్? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల వేతన సవరణకు సంబంధించి 11వ వేతన సవరణ కమిషన్ 27% ఫిట్‌మెంటును సిఫార్సు చేసిందా? అది అంతే మొత్తమని విశ్వసనీయంగా తెలిసింది.
10:44 IST, Oct 31 2021
PRC మంజూరు ప్రక్రియ ఈ నెల 18 లేదా 19 వ తేదీన అన్ని సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి, ఈ నెలాఖరునాటికి 11 వ PRC మంజూరు ప్రక్రియను పూర్తిచేస్తామని చెప్పారు.
10:44 IST, Oct 31 2021
అమరావతి ఐక్యవేదిక సంయుక్త పత్రికా ప్రకటన..13/10/2021 ది 12/10/2021 న రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరియు చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చిన మెమొరాండం పై ఈ రోజు ముఖ్యమంత్రి కార్యాలయం పిలుపు మేరకు AP JAC & AP JAC అమరావతీ నాయకులు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, జి హృదయరాజు, వై వి రావు, కె వి శివారెడ్డి, జి వి నారాయణరెడ్డి గార్లు చర్చలలో పాల్గొనడమైనది.
10:43 IST, Oct 31 2021
పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో త్వరలో అధికారిక చర్చలు ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు పీఆర్సీ అమలుకు సంబంధించి త్వరలోనే అధికారిక చర్చలు ప్రారంభమవుతాయని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద బుధవారం మీడియాతో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. ఆయన అనేక విషయాలు వెల్లడించారు.
10:42 IST, Oct 31 2021
రెండు నెలల్లో సమస్యలు పరిష్కరించడం 2021, అక్టోబర్ 13వ తేదీ బుధవారం ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వం చర్చలు జరిపింది. అనంతరం ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. పీఆర్సీ, సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ వంటి అంశాలపై చర్చలు జరిపామని, వీలైనంత వరకూ పీఆర్సీని ఈ నెలాఖరులోగా క్లియర్ చేస్తామన్నారు. 2021, అక్టోబర్ 18, 19వ తేదీల్లో పీఆర్సీపై ఉన్నతాధికారులు మరోసారి చర్చలు జరుపుతారని, వచ్చే రెండు నెలల్లో సమస్యలు పరిష్కరించడం జరుగుతుందన్నారు.
10:42 IST, Oct 31 2021
జీతాలు ఆలస్యం కాకుండా చూస్తాం, ఈనెలాఖరులోగా పీఆర్సీ ఉద్యోగుల సంక్షేమం, వారి భధ్రత విషయంలో తమ ప్రభుత్వం ఆలోచిస్తుందని, వారి విషయాన్ని బాధ్యతగా భావిస్తున్నామని…వారి విషయంలో రెండు అడుగులు ముందే సీఎం జగన్ ఉంటారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల కృష్ణారెడ్డి వెల్లడించారు. జీతాలు ఆలస్యం కాకుండా చూస్తామని చెప్పిన ఆయన..ఈనెలాఖరులోగా పీఆర్సీ క్లియర్ చేస్తామన్నారు. గత రెండు సంవత్సరాలుగా కోవిడ్ కారణంగా…ఆర్థిక పరిస్థితి బాగాలేక..కొన్ని ఇబ్బందులు వచ్చిన మాట వాస్తవమేనని, ఈ వత్తిడి వల్ల ఉద్యోగుల చిన్న చిన్న సమస్యలు పెద్దయ్యాయని తెలిపారు.
10:41 IST, Oct 31 2021
ధనుంజయ్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలతో ఉద్యోగ జేఏసీ నేతల చర్చలు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో చర్చలు జరుపుతున్నారు. ఏపీ ఎన్ జీ వో జేఏసీ నేతలు బండి శ్రీనివాసరావు, హృదయరాజు, నారాయణరెడ్డి, శివారెడ్డి, అమరావతి జేఏసీ నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు- వై వి రావు తదితరులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలు వీరితో చర్చిస్తున్నారు.
10:40 IST, Oct 31 2021
ప్రభుత్వ సలహాదారు సజ్జలతో ఉద్యోగ సంఘాల నేతల భేటీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో ఉద్యోగ సంఘాల నాయకులు సమావేశమయ్యారు. వెలగపూడిలోని రాష్ర్ట సచివాలయంలో మంగళవారం మధ్యాహ్నం ఈ సమావేశం ప్రారంభమయింది. పీఆర్సీ అమలు, పెండింగు డీఏలు, సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరుగుతోందని సమాచారం
10:39 IST, Oct 31 2021
త్వరలో పీఆర్సీ ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి పీఆర్సీ అమలు, కరవు భత్యం చెల్లింపులు, సీపీఎస్ తో సహా అన్నింటిపై సానుకూల నిర్ణయాలు తీసుకుంటామని ముఖ్యమంత్రి జగన్ మరోసారి హామీ ఇచ్చారు. త్వరలోనే ఉద్యోగ సంఘ నాయకులతో చర్చించి వీటిపై నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారని ఎన్ జీ వో సంఘం రాష్ర్ట అధ్యక్షులు ఎన్.చంద్రశేఖర్ రెడ్డి, బండి శ్రీనివాసరావులు తెలిపారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో బుధవారం ఎన్ జీ వో సంఘం నాయకులు, రాష్ర్ట కార్యవర్గ నేతలు ముఖ్యమంత్రిని కలిసి ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. ప్రాధాన్య క్రమంలో సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పారన్నారు
10:38 IST, Oct 31 2021
ఏపీ ఐకాస అమరావతి డిమాండ్ఉద్యోగులు చిరకాలం గుర్తుంచుకునేలా రాష్ట్ర ప్రభుత్వం 11వ వేతన సవరణను వెంటనే అమలు చేయాలని ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి వైవీ రావు డిమాండు చేశారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని, ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. పొరుగు సేవల ఉద్యోగుల వేతనాలను పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలపై సీఎం జగన్ వీలైనంత త్వరగా సానుకూల నిర్ణయం ప్రకటిస్తారనే విశ్వాసం తమకుందని పేర్కొన్నారు. కొత్త పీఆర్‌సీ కోసం పోరాడాల్సిన ఉద్యోగ సంఘాలు పట్టించుకోవడం లేదనే ప్రచారం జరుగుతోందని, ఉద్యోగుల హక్కులను సాధించడంలో ఏపీ ఐకాస అమరావతి ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు.
10:37 IST, Oct 31 2021
11 పి.ఆర్.సి ప్రతిపాదనలను పరిశీలించుటకు కమిటీ ఏర్పాటు - కమిటీలోని సభ్యులు:1. Chief Secretary : Chairperson 2. Principal Advisor to C.M. : Special Invitee 3. Special Chief Secretary, Revenue : Member 4. Secretary, Finance (BG & HR) : Member 5. Secretary Services, GAD : Member 6. Principal Secretary, Finance : Convenor
For remaining more articles about PRC Click Here