Online Classes: రేపటి నుండి 1 నుండి 10 తరగతుల విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు షురూ..

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Online Classes: డైరెక్టర్‌  SCERT వారు, 1 నుంచి 10వ తరగతి వరకు డీటెయిల్‌ అకాడమిక్‌ క్యాలెండర్‌ మరియు కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొని అందుబాటులో ఉన్న వివిధ రకాల అఆన్లెన్‌ మాధ్యమాల ద్వారా అనగా దూరదర్శన్‌, రేడియో, యూట్యూబ్‌, వాట్సాప్‌ గ్రూప్‌ ద్వారా పర్సనల్‌ కాంట్రాక్ట్‌ ద్వారా అన్ని తరగతుల వారికి రేపటి నుండి అనగా 12 జూన్‌ 2021 నుంచి ఆన్లెన్‌ తరగతులు నిర్వహించేటట్టుగా అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ సిబ్బందికి తగు సూచనలు ఇస్తూ విద్యార్థికి తగు అకడమిక్‌ సపోర్ట్‌ ను అందించవలెనని సూచించినారు.

జిల్లా విద్యాశాఖాధికారి, తూర్పుగోదావరి, కాకినాడ.

ప్రస్తుతం: శ్రీ ఎస్‌. అబ్రహం ఎం.ఎ., ఎం.ఎ.యి.డి

రి.నం. 501/డి.సి. ఈ. బి. /2021, తేది: 11.06.2021

విషయం: పాఠశాల విద్య, తూర్పుగోదావరి - కొవిడ్‌ -19 మహమ్మారి - అన్ని పాఠశాలలకు- 1నుంచి 10వ తరగతి విద్యార్థులకు అన్లెన్‌- క్లాసుల నిర్వహణ -- గురించి.

నిర్దేశనం: ఆర్‌.సి.నెం 151/4& 1/2020 తేదీ 30.05.2021... డైరెక్టర్‌, పాఠశాల విద్యా శాఖ, అమరావతి వారి కార్యావర్తనములు.

జిల్లాలోని అందరూ ఉప విద్యాశాఖాధికారులకు, మండల విద్యాశాఖాధికారులకు మరియు అందరు ప్రధానోపాధ్యాయులకు తెలియజేయునది ఏమనగా కొవిడ్‌ -19 సెకండ్‌ వేవ్‌ కారణంగా 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు మరియు ఉపాధ్యాయులకు 30.06.2021 వరకు వేసవి సెలవులు పొడిగించడం జరిగింది.

పై విషయముల దృష్ట్యా అందరూ ప్రధానోపాధ్యాయులు తమ సిబ్బందితో సమన్వయ పరచుకుంటూ అన్నితరగతుల ( ప్రాధమిక, ప్రాధమికోన్నత & ఉన్నత పాఠశాలలు ) విద్యార్థులకు ఆన్లైన్‌ తరగతులు నిర్వహించవలసిందిగా ఆదేశించడమైనది మరియు రేపటి నుంచి ఎంత మంది విద్యార్థులు ఆన్లెన్‌ ద్వారా అందుబాటులోకి వచ్చింది అనే విషయాన్ని సంబంధిత ఉప విద్యాశాఖా లకు, మండల విద్యాశాఖాధికారులకు తెలియజేయవలెను.

Download Orders - Click Here



Below Post Ad


Post a Comment

0 Comments