Jobs: వెంటనే భర్తీ చేయాల్సిన ఖాళీలు 1,148

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

  • రెవెన్యూ శాఖలో వివరాలు సేకరించిన అధికారులు
  • ఇందులో గ్రూపు-1, గ్రూపు-2 పోస్టులూ ఉన్నాయి

Jobs: రెవెన్యూ శాఖలో అత్యవసరంగా 1,148 పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరం ఉందని అధికారులు గుర్తించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు భూ పరిపాలన ప్రధాన కార్యాలయం రాష్ట్రంలో రెవెన్యూ విభాగంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల వివరాలను సేకరించింది. రెవెన్యూ శాఖలో అన్ని కేటగిరిల్లో కలిపి మంజూరైన పోస్టులు 30,001 ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం ఉన్న ఉద్యోగులను మినహాయిస్తే...ప్రత్యక్ష నియామకాల కింద భర్తీ చేయాల్సినవి 9,918 పోస్టులు కాగా వీటిలో వెంటనే 1,148పోస్టులకు నియామకాలు అవసరమని గుర్తించారు. వీటిలో డిప్యూటీ కలెక్టర్లు- 17 (గ్రూపు-1), డిప్యూటీ తహశీల్దార్లు - 67 (గ్రూపు-2) పోస్టులు ఉన్నాయి. అలాగే సీనియర్‌ స్టెనోగ్రాఫర్లు - 4, (గ్రూపు-2), జూనియర్‌ అసిస్టెంట్‌-కం-టైపిస్టు (సీసీఏల్‌ఏ కార్యాలయం) 65, జూనియర్‌ అసిస్టెంట్స్‌ (జిల్లాల్లో)- 322, జూనియర్‌ స్టెనోగ్రాఫర్‌(గ్రూపు-4) పోస్టులు మూడు చొప్పున ఖాళీగా ఉన్నాయి. వీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 670 (గ్రూపు-4) జూనియర్‌ అసిస్టెంట్‌-కం-కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గతంలో రెవెన్యూ శాఖకు మంజూరు చేసిన 30,001 పోస్టుల్లో ప్రస్తుతం 9,918 ఖాళీగా ఉన్నాయి. వీటిలో విలేజ్‌ రెవెన్యూ అసిస్టెంట్‌ (పార్టుటైం) పోస్టులు 7,917 ఉన్నాయి. వాస్తవానికి ఈ కేటగిరిలో 27,419 పోస్టులు మంజూరై ఉన్నాయి. మిగిలిన వాటిని ప్రత్యక్ష విధానంలో భర్తీ చేయాల్సి ఉన్నా అత్యవసరంగా పోస్టులు భర్తీ చేయాల్సిన జాబితాలో వీటికి స్థానం లభించలేదు. అలాగే 861 టైపిస్టు పోస్టులు మంజూరు కాగా 635 పోస్టులను ప్రత్యక్ష విధానంలో భర్తీ చేయాల్సి ఉందని గుర్తించారు. ఈ పోస్టుల వివరాలూ భర్తీ చేయాల్సిన ఉద్యోగాల జాబితాలో లేవు.

670 పోస్టుల భర్తీకి సంబంధించి...!

రెవెన్యూ శాఖ అత్యవసరంగా 1,148 పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నా...ప్రభుత్వం నిర్ణయం తెలియరాలేదు. వాస్తవానికి..670 జూనియర్‌ అసిస్టెంట్‌-కం-కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టులను భర్తీ చేయాలని చాలా కాలం క్రితమే రెవెన్యూ(సీసీఏల్‌ఏ) శాఖ నుంచి ఏపీపీఎస్సీకి ప్రతిపాదనలు వెళ్లాయి. అయితే ఇప్పటికీ భర్తీ ప్రకటన వెలువడలేదు. పోస్టు హోదా..అర్హతల విషయంలో స్పష్టత విషయమై ఏపీపీఎస్సీ, రెవెన్యూ శాఖల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగినా ప్రకటన జారీ కాలేదు. అలాగే భూ పరిపాలన ప్రధాన శాఖ కార్యాలయంలో 65 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఖాళీగా ఉండటంతో జిల్లాల నుంచి డిప్యుటేషన్లపై కొందర్ని పిలుస్తున్నారు.

21న ధ్రువపత్రాల పరిశీలన

సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల భర్తీలో భాగంగా ఈ నెల 21న ధ్రువపత్రాలను విజయవాడలో పరిశీలించనున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. ఏపీ మెడికల్‌ ఇన్సూరెన్స్‌ సర్వీసెస్‌ తరపున జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం ఏపీపీఎస్సీ ఈ పోస్టులను భర్తీ చేస్తుంది. పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో ఉన్నాయి.



Below Post Ad


Post a Comment

0 Comments