Trending

ITR filing: నేటి నుంచి మొబైల్‌తో ఇన్‌కంటాక్స్ ఫైలింగ్... కొత్త పోర్టల్ తెచ్చిన కేంద్రం

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 Mobile ITR filing: ఇన్‌కంటాక్స్ రిటర్న్ ఫైల్ చెయ్యాలంటే... అదో పెద్ద తలనొప్పి అనుకుంటున్నారా... ఇకపై అలాంటి పరిస్థితి ఉండదు. కేంద్ర ప్రభుత్వం కొత్త పోర్టల్ తెచ్చింది. దాని పూర్తి వివరాలు తెలుసుకుందాం

Mobile ITR filing: ఇన్‌కంటాక్స్ చెల్లింపులను మరింత ఈజీ చేస్తూ... కేంద్ర ప్రభుత్వంలో భాగమైన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టు టాక్సెస్ (CBDT) సరికొత్త నిర్ణయం తీసుకుంది. జూన్ 7న సరికొత్త పోర్టల్ తెచ్చింది. అదే... www.incometax.gov.in ఇకపై దీని ద్వారా ఇన్‌కంటాక్స్ రిటర్నులను ఫైల్ చెయ్యవచ్చు. దీన్ని ఇవాళ ప్రారంభిస్తారు. దీని ద్వారా... టాక్స్ రిటర్నుల ప్రక్రియ చాలా వేగంగా జరుగుతుంది. అలాగే... రిఫండులు కూడా వేగంగా జరుపుతారు. చూడటానికీ, వాడటానికీ ఈ పోర్టల్ చాలా సౌకర్యవంతంగా ఉంటుందని కేంద్రం తెలిపింది. CBDI అధికారిక స్టేట్‌మెంట్ ప్రకారం... కొత్త పోర్టల్... పన్ను చెల్లింపుదారులకు అనుకూలంగా, అత్యాధునికంగా, ఏమాత్రం కష్టం లేకుండా పనైపోయేలా ఉంటుంది. ఇందులో మీకు ప్రధానంగా 5 ఫీచర్లు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. 

1. Taxpayer friendly: ఈ కొత్త పోర్టల్‌లో గందరగోళం ఉండదు. ఇందులో టాక్స్ చెల్లించడం చాలా తేలిక. ఇది ప్రజలకు అనుకూలంగా, వారికి ఈజీగా అర్థమయ్యేలా ఉంటుంది. టాక్స్ చెల్లింపుల ప్రక్రియ ఇదివరకు ఎప్పుడూ జరగనంతవేగంగా జరుగుతుంది. రిఫండ్స్ చాలా వేగంగా వస్తాయి.

2. Single, simple dashboard: ఐటీ శాఖ ప్రకారం... కొత్త పోర్టల్‌లో సింగిల్ డాష్‌బోర్డ్ ఉంటుంది. ఇందులో పన్ను చెల్లింపుల ప్రక్రియ ఉంటుంది. అందువల్ల ప్రజలు ఎక్కడ చెల్లించాలి అని వెతుక్కోవాల్సిన పని ఉండదు. ఈ సింగిల్ డ్యాష్‌బోర్డులోనే పన్నులకు సంబంధించి అన్నీ ఉంటాయి. అందులోనే రిటర్నుల అప్‌లోడ్ కూడా ఉంటుంది. 

3. Mobile app for ITR filing: జూన్ 18న సరికొత్త పన్ను చెల్లింపుల ప్రక్రియను ప్రారంభించాలనుకుంటోంది CBDT. అందుకోసం ఐటీ శాఖ మొబైల్ యాప్ తెచ్చింది. పోర్టల్‌తోపాటూ... మొబైల్ యాప్ కూడా ఇవాళే ప్రారంభిస్తుంది. ఇందులో కూడా రకరకాల ఫీచర్లు ఉంటాయి. మొబైల్ యాప్‌తో కూడా ఐటీ రిటర్నులను దాఖలు చెయ్యవచ్చు.

4. Income Tax preparation software: కొత్త పోర్టల్‌లో సరికొత్త సాఫ్ట్‌వేర్ ఉంది. ఇది చాలా వేగంగా... ప్రక్రియను పూర్తి చేస్తుంది. ITR దాఖలుకు ఎలాంటి రుసుములూ ఉండవు. ఇందులో సింపుల్ ప్రశ్నలు ఉంటాయి. అంటే... ITRలు 1 నుంచి 4 వరకూ (ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్), అలాగే ITR 2 (ఆఫ్ లైన్) అందుబాటులో ఉంటాయి. ఇక ITRలు 3, 5, 6, 7 దాఖలు చేయడానికి మరికొన్ని రోజుల్లో వీలు కలుగుతుందని అని CBDT చెప్పింది.

5. Call centre facility: కొత్త పోర్టల్‌లో టాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఏదైనా సమస్య వచ్చినట్లు భావిస్తే... వెంటనే ఇన్‌కంటాక్స్ డిపార్ట్‌మెంట్ కొత్తగా ఏర్పాటు చేసిన సెల్ సెంటర్‌ (కాల్ సెంటర్)కి కాల్ చేసి డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు. ఈ కొత్త పోస్టల్‌లో తరచూ అడిగే ప్రశ్నలు (FAQs), యూజర్ మాన్యువల్స్, వీడియోలు, చాట్‌బోట్, లైవ్ ఏజెంట్ సదుపాయాలు ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. 


Below Post Ad


Post a Comment

0 Comments