Corona Update: దేశంలో కొత్తగా 1.14 లక్షల కరోనా కేసులు, 2,677 కరోనా మరణాలు

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టినా మరణాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు.

 గడిచిన 24 గంటల్లో 1,14,460 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసులు 2,88,09,339కు పెరిగాయి. శనివారం నాడు దేశంలో 2,677 మంది వైరస్‌ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 3,46,759గా నమోదైంది.

మరో వైపు నిన్న ఒకే రోజు 1,89,232 బాధితులు డిశ్చార్జి అయ్యారని మంత్రిత్వశాఖ పేర్కొంది. ఇప్పటి వరకు 2,69,84,781 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 14,77,799 యాక్టివ్‌ కేసులున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. టీకా డ్రైవ్‌లో ఇప్పటి వరకు 23,13,22,417 డోసులు వేసినట్లు పేర్కొంది.



Below Post Ad


Tags

Post a Comment

0 Comments