Brain Boosting Food For Kids: మీ పిల్లల మెదడు చురుగ్గా పనిచేయాలంటే ఈ ఆహారం తినిపించాలి.. నిపుణుల సూచనలు..

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Brain Boosting Food: సరైన ఆహారం జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.

 మెదడు శరీరంలోని మిగిలిన అవయవాలతో మనం తినే ఆహారం నుంచి పోషకాలను గ్రహిస్తుంది. అందువల్ల పిల్లలు మెదడు చురుగ్గా.. ఆరోగ్యంగా ఉంచే పోషకమైన ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. అందుకోసం మీ పిల్లలకు ఇచ్చే ఆహారం గురించి నిపుణులు కొన్ని సూచనలు ఇస్తున్నారు.

వోట్స్.. మెదడుకు ఎక్కువగా శక్తిని అందించే వనరులు. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇది పిల్లలు జంక్ ఫుడ్, చిరుతిండి తినకుండా నిరోధిస్తుంది. ఇందులో విటిమిన్లు ఇ, బి కాంప్లెక్స్, జింక్ ఎక్కువగా ఉన్నాయి. ఇవి పిల్లల మెదడు చురుగ్గా, ఆరోగ్యంగా ఉండేందుకు సహయపడతాయి. అలాగే ఆపిల్, అరటి, బ్లూబెర్రీస్, బాదం వంటి ఆహారాన్ని అందించాలి.

అలాగే చేపలు.. ఇందులో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మెదడు అభివృద్ధికి, ఆరోగ్యంగా ఉండేందుకు సహయపడతాయి. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు సెల్ యొక్క బిల్డింగ్ బ్లాక్స్ యొక్క అవసరమైన భాగాలు. సాల్మన్, మాకేరెల్, ఫ్రెష్ ట్యూనా, ట్రౌట్, సార్డినెస్, హెర్రింగ్ వంటి చేపలు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి వారానికి ఒకసారి తినాలి. పాలు, పెరుగు, జున్నులో ప్రోటీన్ బి విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి మెదడు కణజాలం, న్యూరోట్రాన్స్మిటర్లు, ఎంజైమ్‌ల పెరుగుదలకు అవసరం. ఇవన్నీ మెదడులో ముఖ్యమైన పాత్రలను పోషిస్తాయి. ఈ ఆహారాలలో కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది బలమైన, ఆరోగ్యకరమైన దంతాలు , ఎముకల అభివృద్ధికి సహయపడతాయి. పిల్లలకు కాల్షియం అవసరం వారి వయస్సును బట్టి మారుతూ ఉంటాయి. కానీ ప్రతి రోజు రెండు నుండి మూడు కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.

పిండి పదార్థాలు, ప్రోటీన్, తక్కువ మొత్తంలో ఆరోగ్యకరమైన కొవ్వు కలయికతో పిల్లలకు అల్పాహారంగా ఇవ్వాలి. గుడ్లలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఇది జ్ఞాపకశక్తికి సహాయపడుతుంది.



Below Post Ad


Post a Comment

0 Comments