Trending

6/trending/recent

WhatsApp Privacy Policy: వాట్సాప్‌ ప్రైవసీ పాలసీకి ‘ఎస్‌’ కొట్టేశారా? అయితే, ఇప్పుడు ఏమవుతుందో తెలుసా..?

WhatsApp Privacy Policy: వాట్సాప్ లో కొత్త ప్రైవసీ నిబంధనలు అమలులోకి వచ్చాయి. అయితే ఈ నిబంధనలను అంగీకరిస్తే ఏమంతుందోన్న సందేహం అందిరిలో వ్యక్తమవుతుంది. వారి కోసం ఈ వివరాలు..

వాట్సాప్‌ కొత్త ప్రైవసీ పాలసీ గురించి గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. కొత్త పాలసీని అంగీకరిస్తే వ్యక్తిగత సమాచారం ఫేస్‌బుక్‌, దాని అనుబంధ సంస్థలకు వెళ్తుంది అంటూ చర్చ కొనసాగుతూనే ఉంది. ఆఖరికి ఆ విషయం ఢిల్లీ హైకోర్టు మెట్లెక్కింది. అయితే ఈ విషయంలో పట్టుదిగని వాట్సాప్‌, ఈ నెల 15 నుంచి కొత్త ప్రైవసీ పాలసీని అమలులోకి తెచ్చినట్లు ప్రకటించింది. కొత్త నియమ నిబంధనలను అంగీకరించకపోతే, యూజర్ల వాట్సాప్‌ సేవలు నిలిపేస్తాం అని సంస్థ చెబుతోంది. ఒక్కసారి ప్రైవసీ పాలసీకి యాక్సెప్ట్‌ కొడితే... మళ్లీ వినియోగదారులు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం కుదరదు. అయితే ఈ నియమాలకు ఓకే చెప్తే ఏమవుతుందనే ప్రశ్న వేస్తున్నారు కొందరు నెటిజన్లు. ఈ నేపథ్యంలో అసలు కొత్త నిబంధనలు యూజర్లు ఎలా ప్రభావితం చేస్తాయో చూద్దాం. ప్రైవసీ పాలసీలో చేసిన మార్పులు బిజినెస్‌ ఫీచర్ల కోసమే అని వాట్సాప్‌ చెబుతోంది. యూజర్లకు సంబంధించిన డేటా విషయంలో భవిష్యత్తులో ఎలాంటి ఆలోచనలు చేస్తుందనేది ఆ పాలసీలో పొందుపరిచారు. సాధారణంగా బిజినెస్‌ అకౌంట్లలో రెండు రకాలు ఉంటాయి.

ఒకటి క్లౌడ్‌ ప్రొవైడర్స్‌ అయితే, రెండోది సాధారణ అకౌంట్‌. ఈ సమయంలో కొత్త ప్రైవసీ పాలసీ తొలి అకౌంట్‌కే వర్తిస్తుంది. రెండో అకౌంట్‌లో ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ కొనసాగుతుంది. అంటే రెండో రకం బిజినెస్‌ అకౌంట్‌తో సంభాషణ జరపడం అంటే సాధారణ వాట్సాప్‌ ఖాతాతో సంభాషించినట్లే ఉంటుంది. మొదటి రకం బిజినెస్‌ ఖాతాతో సంభాషించినప్పుడు (ఛాట్‌ చేసినప్పుడు) వాటి ప్రకారం యాడ్స్‌ ఆ మొబైల్లో వస్తాయి. అయితే ఇలాంటి ఖాతాలకు ప్రత్యేకమైన గుర్తు (బ్యాడ్జ్‌) ఇస్తారు. కాబట్టి ఆ తరహా బిజినెస్‌ అకౌంట్‌ ఉన్నవాళ్లతో ఛాట్‌ చేయాలా వద్దా అనేది యూజర్ల ఇష్టం.

అంతేకాదు వాట్సాప్‌ బిజినెస్‌ అకౌంట్‌తోపాటు, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌కు సంబంధించిన క్లౌడ్‌ప్రొవైడర్స్‌ ఆప్షన్‌ ఎనేబుల్‌ ఉన్నవాళ్లతో బిజినెస్‌ అకౌంట్స్‌తో ముచ్చటించినా ఆ డేటాను ఫేస్‌బుక్‌ సంగ్రహిస్తుంది. దానికి తగ్గట్టుగా యూజర్లకు యాడ్స్‌ వచ్చేలా తమ యాడ్‌ నెట్‌వర్క్స్‌కు అందిస్తుంది. అయితే ఈ విషయాన్ని కూడా వాట్సాప్‌ వినియోగదారులకు తెలియజేస్తుంది. ఇదన్నమాట వాట్సాప్‌ కొత్త ప్రైవసీ పాలసీని యాక్సెప్ట్‌ చేస్తే జరిగేది.

మొన్నీమధ్య ఢిల్లీ హైకోర్టులో జరిగిన కేసు వాదనల్లో వాట్సాప్‌ తరఫు న్యాయవాది కపిల్‌ సిబల్‌ మాట్లాడుతూ... ‘కొత్త ప్రైవసీ పాలసీని అంగీకరించని... వాట్సాప్‌ ఎలాంటి వాట్సాప్‌ ఖాతాలను డిలీట్‌ చేయలేదు. వినియోగదారులు ఒప్పుకునేంతవరకు కొత్త పాలసీని అంగీకరించమని అడుగుతాం. ఆ తర్వాత మెల్లగా అంగీకరించని వారి ఖతాలు డిలీట్‌ చేస్తాం’ అని చెప్పారు. అంటే ఎప్పుడో ఒకప్పుడు యూజర్లు కొత్త నియమ నిబంధనలను అంగీకరిస్తేనే, వాట్సాప్ సేవలు పొందే వీలుంటుంది.


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad