Trending

6/trending/recent

Salaries Stopped: విధుల్లో ఉద్యోగుల నిర్లక్ష్యం.. షాకిచ్చిన చిత్తూరు కలెక్టర్.. జీతాలు నిలిపివేస్తూ ఉత్తర్వులు

Chittoor Collector Harinarayan ordered to stop salaries: చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు.. తమ పనిని పూర్తిచేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. 

ఒకవేళ చేయకపోయినా.. ప్రభుత్వ ఉద్యోగం.. నెల పూర్తయితే తమ జీతం తమకు వస్తుందంటూ ధీమా వ్యక్తంచేస్తుంటారు. అలాంటి వారి పట్ల ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా కలెక్టర్‌ హరినారాయణన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. 5 మండలాల ఉద్యోగుల జీతాలు నిలుపుదల చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని పెదమండ్యం, తవణంపల్లె, శ్రీకాళహస్తి, సత్యవేడు, మదనపల్లె మండలాల్లోని రెవెన్యూ, పంచాయతీరాజ్, హెల్త్, సచివాలయం, మునిసిపల్ శాఖల ఉద్యోగుల నెలవారీ జీతాలను నిలిపివేస్తున్నట్లు హరినారాయణన్ వెల్లడించారు.

ఆయా మండలాల పరిధిలో ఆరో విడత ఫీవర్ సర్వేలో పలు శాఖల అధికారులు నిర్లక్ష్యం వహించారని హరినారాయణన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు వారందరిపై విపత్తు నిర్వహణ చట్టం కింద చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఆదేశాలను బేఖాతరు చేసిన వారిపైనా ఇదే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటానంటూ తీవ్రంగా హెచ్చరించారు. వారందరికీ.. జీతాలు నిలిపివేయాలని జిల్లా ట్రెజరీని ఆదేశించారు. ఇంకా ఎవరైనా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవంటూ సూచనలు చేశారు.



Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad