Petrol Diesel Price: గత కొన్ని రోజుల క్రితం ఐదు రాష్ట్రాల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నుంచి ఎన్నికలు పూర్తయ్యేంత వరకు పెట్రోల్, డీజిల్ ధరల్లో పెద్దగా మార్పులు లేవు. అంతకుముందు ఆకాశమే హద్దుగా పెరిగిన ఇంధన ధరలు.. ఎన్నికల సమయంలో మాత్రం కాస్త శాంతించాయి. అయితే ఇప్పడు ఇంధన ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. వరుసగా రేట్లు పెరుగుతున్నాయి. తాజాగా ఆదివారం కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
* దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.92.58 ఉండగా డీజిల్ రూ. 83.22 వద్ద కొనసాగుతోంది.
* ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.88 ఉండగా, డీజిల్ ధర రూ. 90.40 గా ఉంది.
* తమిళనాడు రాజధాని చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ. 94.31 వద్ద కొనసాగుతుండగా, డీజిల్ ధర రూ. 88.07 గా ఉంది.
* కర్ణాటక రాజధాని బెంగళూరులో లీటర్ పెట్రోల్ రూ. 95.33 గా ఉండగా, డీజిల్ రూ. 87.92 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే..
* తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.22 గా ఉండగా.. డీజిల్ ధర రూ. 90.73 గా ఉంది.
* ఇక తెలంగాణలో మరో ముఖ్యమైన నగరమైన కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.52 గా ఉండగా, డీజిల్ రూ. 91 వద్ద కొనసాగుతోంది.
* ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే.. విజయవాడలో ఆదివారం లీటర్ పెట్రోల్ ధర రూ. 99.23 గా ఉండగా, డీజిల్ రూ. 93.11 వద్ద కొనసాగుతోంది.
* సాగగతీరం విశాఖలో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.59 ఉండగా, డీజిల్ రూ. 91.56 గా నమోదైంది.