Inter, SSC Exams: టెన్త్, ఇంటర్ పరీక్షలపై క్లారిటీ ఇచ్చిన మంత్రి ఆదిమూలపు

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Inter, SSC Exams: టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ పై విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. 

టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ నిర్వహణకి ఏర్పాట్లు అన్నీ జరిగాయని…ఈ నెలాఖరు వరకూ విద్యార్థులకు సెలువులు ఇచ్చామని తెలిపారు. జూన్ 1 నుండి ఉపాధ్యాయుల్ని స్కూల్స్ కి రమ్మని చెప్పామని, ప్రభుత్వం ప్రతి విషయాన్ని నిశితంగా గమనిస్తోందన్నారు. ప్రతిపక్ష పార్టీలు కుట్రపూరితంగా విద్యార్థులు, తల్లిదండ్రుల్ని భయాందోళకు గురి చేస్తున్నాయని…పరీక్షల నిర్వహణకి ఇంకా మూడు వారాల సమయం ఉందని పేర్కొన్నారు. పదో తరగతిలో గ్రేడింగ్ లేకపోతే విద్యార్థులకు నష్టం వాటిళ్లుతుందని…విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించారని.. ముందస్తుగా షెడ్యూల్ ఇచ్చి పరీక్షలు నిర్వహిస్తామన్నారు.



Below Post Ad


Post a Comment

0 Comments