India Corona Cases: గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తవి ఎన్నంటే..

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 Corona updates: ఇది నిజంగా శుభవార్తే. భారత్‌లో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. మరణాల సంఖ్య కూడా కాస్త తగ్గడం కాస్త ఊరట కలిగిస్తోంది. మరి గురువారం ఎన్ని కేసులు వచ్చాయి? ఎంత మంది మరణించారు? పూర్తి వివరాలు ఇక్కడ చూడండి


Covid 19 Updates: భారత్‌లో గడిచిన 24 గంటల్లో  1,86,364 కొత్త కేసులు నమోదయ్యాయి.  గత 44 రోజుల్లో ఇదే అత్యల్పం. కోవిడ్ నుంచి 2,59,459 మంది కోలుకున్నారు. గురువారం  3,660 మంది మరణించారు. 

తాజా లెక్కలతో మన దేశంలో మొత్త కరోనా కేసుల సంఖ్య 2,75,55,457కి చేరింది. వీరిలో 2,48,93,410 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి ఇప్పటి వరకు 3,18,895 మంది మరణించారు.

మన దేశంలో తమిళనాడులోనే అత్యధిక కేసులు వస్తున్నాయి. తమిళనాడులో 33,361, కర్నాటకలో 24214, కేరళలో 24,166, మహారాష్ట్రలో21,273 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.

మన దేశంలో గురువారం 20,70,508 మందికి కరోనా టెస్ట్‌లు చేశారు. ఇప్పటి వరకు 33,90,39,861 పరీక్షలు నిర్వహించారు. ఇక వ్యాక్సిన్‌ల విషయానికొస్తే.. 20,57,20,660 డోసుల వ్యాక్సిన్‌లు ఇచ్చారు.


Below Post Ad


Post a Comment

0 Comments