Gold Price Today: పసిడి వెలవెలబోతోంది. తాజాగా నేలచూపులు చూస్తోంది. పసిడి రేటు ఈరోజు కూడా పడిపోయింది. బంగారం ధర దిగొచ్చింది. కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న పసిడి ధర.. ఈ రోజు తగ్గుముఖం పట్టింది. పసిడి ప్రేమికులకు ఇది ఊరట కలిగించే అంశమని చెప్పాలి. బంగారం ధర బంగారం ధర బాటలోనే వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. ఇక అక్షయ తృతీయ ముంగిట బంగారం ధర దిగిరావడం చాలా మందికి కలిసొచ్చే అంశమని చెప్పుకోవచ్చు. అక్షయ తృతీయ ఈ నెల 14న వస్తుంది. అంటే శుక్రవారం అక్షయ తృతీయ. చాలా మంది అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే మంచిదని విశ్వాసిస్తారు. అందుకే పసిడిని కొంతైనా కొనుగోలు చేస్తుంటారు. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల ఇలా ఉన్నాయి.
తాజా ధరలు ఇలా..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,900 ఉంది. దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,720 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,720 వద్ద ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,090 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,800 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,560 ఉంది. అలాగే బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,560 ఉంది. ఇక కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,560 ఉంది.
ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,560 ఉంది. అలాగే విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,560 వద్ద ఉంది.
అయితే బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. అయితే బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూనే ఉంటాయి. బంగారం కొనుగోలు చేసే వారు ధరలను తెలుసుకొని వెళ్లడం మంచిది.