Gold Price Today 09-05-2021: మహిళలకు షాక్ : 50 వేలకు చేరువలో బంగారం ధరలు

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Gold Price Today 09-05-2021: బంగారం ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు.  ఇండియాలో బంగారానికి ఉన్న డిమాండ్‌ దేనికి ఉండదు. అయితే.. కొన్ని రోజులుగా బంగారం ధరల్లో ఒడిదుడుకులు కొనసాగుతూనే ఉన్నాయి. గత వారం రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ వస్తున్న బంగారం ధర... ఇవాళ మాత్రం భారీగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు కిందికి కదలడంతో... బులియన్ మార్కెట్‌లోనూ దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110  పెరిగి రూ. 48,660 కు చేరగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100  పెరిగి రూ. 44,600 కు చేరింది. ఇక ఈ రోజు బంగారం ధరలు పెరగగా... వెండి ధరలు మాత్రం నిలకడగా ఉంది. కిలో వెండి ధర ప్రస్తుతం రూ. 76,100 వద్ద కొనసాగుతోంది. 



Below Post Ad


Post a Comment

0 Comments