Trending

6/trending/recent

English Online Training: ఆంగ్లంపై ఆన్లైన్ శిక్షణ

  • ఉపాధ్యాయులకు తర్ఫీదు
  • నైపుణ్యం సాధించేలా అవగాహన
  • పాఠ్యాంశాలపై లోతైన అధ్యయనం.
  • జూన్ 2 వరకు ఆన్లైన్ తరగతులు

మచిలీపట్నం: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం అమలుకు సిద్ధమైన సర్కారు ఆ దిశగా ఉపాధ్యాయులను సన్నద్ధం చేస్తోంది. ఆంగ్ల మాధ్యమంలో ముద్రించిన పుస్తకాలపై 1 నుంచి 8వ తరగతి బోధించే టీచర్లకు ప్రస్తుతం 'దీక్ష పేరిట ఆన్లైన్ శిక్షణ నిర్వహిస్తోంది. జిల్లాలోని 6,792 మంది ఉపాధ్యాయులను శిక్షణలో భాగ స్వాములను చేసింది. ఈనెల 7న ప్రారంభమైన శిక్షణ జూన్ 2 వరకు కొనసాగనుంది.

టీచర్ల నైపుణ్యం పెరగాలని...

 ప్రాథమిక స్థాయిలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టాలని భావించిన సర్కారు గత ఏడాదే పాఠ్యం పుస్తకాలను ముద్రించింది. 2020-21 విద్యా సం వత్సరంలోనే వీటిని పాఠశాలలకు సరఫరా చేసిం ది. కోవిడ్ నేపథ్యంలో స్కూళ్లు పూర్తిస్థాయిలో పని చేయకపోవడంతో బోధన సరిగా సాగలేదు. ఉపా ధ్యాయులు ఆంగ్ల మాధ్యమ పుస్తకాలపై అవగా హన పెంచుకోలేకపోయారు. 2021-22 విద్యా సంవత్సరంలో ఆంగ్ల మాధ్యమ బోధన సవ్యంగా సాగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా టీచర్లకు శిక్షణ ఇస్తోంది. పాఠ్యపుస్తకా లను ఏ ప్రాతిపదికన తీర్చిదిద్దారు. అందులోఉన్న సిలబస్ ? బోధన ఎలా చేయాలి? అనే అంశా లపై ప్రస్తుతం శిక్షణ సాగుతోంది. కార్పొరేటు దీటుగా ప్రాథమిక స్థాయి. లోనే ప్రతి సబ్జెక్టుకూ వర్క్: బుక్లను రూపొందించిన విద్యాశాఖ వీటిని విద్యా ర్డులతో ఎలా ప్రాక్టీసు చేయించాలనే దానిపైనా టీచర్లకు తర్ఫీదు ఇస్తోంది. ఉపాధ్యాయుల బోధన సామర్థ్యం పెంచేందుకు కృషి చేస్తోంది.. 

శిక్షణ ఇలా...

• రోజూ మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు దీక్ష యాప్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం పద్ధతిలో నిష్ణా తులైన రిసోర్స్పర్సన్లు ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నారు.

• ఒకవేళ ఏదైనా కారణాలతో టీచర్లు లైవ్లో పాల్గొనలేకపోయినా, దీర్ఘ యాప్లో అందుబా. టులో ఉన్న శిక్షణ అంశాలతో కూడిన వీడియోను చూసేలా ఏర్పాట్లు చేశారు..ఒక్కో సబ్జెక్టుపై నాలుగు రోజుల పాటు శిక్షణ ఇచ్చేలా టైంటేబుల్ సిద్ధం చేసి అమలు చేస్తున్నారు.

• సబ్జెక్టుల వారీగా ఆన్లైన్ పరీక్షలూ నిర్వహిస్తు న్నారు. రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ సంస్థ రూపాం. దించిన మాడ్యూల్ ఆధారంగా పరీక్ష ఉంటుంది.

• శిక్షణ పూర్తయిన తర్వాత టీచర్లకు ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తారు.

ఆదరణ బాగుంది

దీక్ష శిక్షణకు ఉపాధ్యాయుల నుంచి మంచి ఆద రణ లభిస్తోంది. పరిసరాలు, స్థానిక అం శాలను బేరీజు వేస్తూ పాఠ్యాంశాల బోధన చేస్తేనే విద్యార్థులకు మేలు జరుగుతుంది. శిక్ష ణలో దీనికే ప్రాధాన్యం ఇస్తున్నాం..

- నాదిళ్ల మురళీ కృష్ణ, రాష్ట్ర రిసోర్స్ పర్సన్

భాగస్వాములు కావాలి

ప్రాథమిక, ప్రాథమికోన్నత ఉపాధ్యాయులం తా భాగస్వాములు కావాలి. దీనిపై ఉన్నత సాంకేతిక స్థాయిలో సమీక్ష ఉంటుంది. ఏదైనా ఇబ్బందులు ఉంటే ముందుగానే తెలియ జేయాలి. శిక్షణలో పాల్గొనకుంటే శాఖాపరంగా చర్యలు తప్పవు.

- శ్యామసుందర్రావు, అసిస్టెంట్ మానిటరింగ్ అధికారి, సమగ్ర శిక్ష అభియాన్



Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad