Dangerous Lake: ఈ సరస్సు నీటిని తాకితే రాయిగా మారిపోతారు..! అవును మీరు విన్నది నిజమే..? ఇది ఎక్కడ ఉందో తెలుసా..

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 African Dangerous Lake : బాల్యంలో ఒక రాజు కథను మీరు వినే ఉంటారు. అతను తాకినదంతా బంగారంగా మారుతుందని కానీ ఒక సరస్సు నీటిని తాకితే రాయిగా మారిపోతారని మీరు విన్నారా.. అవును ఇది నిజం. అలాంటి సరస్సు ఉత్తర టాంజానియాలోని ఉంది. దాని పేరు నేత్రాన్ సరస్సు. ఈ సరస్సులోని నీటిని తాకిన జంతువులు, పక్షులు వెంటనే రాళ్లుగా మారిపోయాయి. ఇప్పటికి అవి చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. ఈ ప్రమాదకరమైన సరస్సుకు సాక్ష్యాలుగా మిగిలిపోయాయి.

ఆఫ్రికన్ దేశమైన ఉత్తర టాంజానియాలో నేట్రాన్ సరస్సు గురించి చెప్పబడింది. ఈ సరస్సులోని నీటిని తాకినందున జంతువులన్నీ రాయిగా మారతాయి. శాస్త్రీయ దృక్కోణంలో నాట్రాన్ సరస్సులోని నీటి ఆల్కలీన్ పిహెచ్ 10.5 కు సమానం. ఇది కాస్టిక్‌గా ఉంటుంది. నీటిని తాకిన వెంటనే జంతువుల చర్మం, కళ్ళను కాల్చేస్తుంది. నీటి క్షారత అయిన సోడియం కార్బోనేట్ ఇతర ఖనిజాల నుంచి వస్తుంది, ఇవి చుట్టుపక్కల కొండల నుంచి సరస్సులోకి ప్రవహిస్తాయి. ఈ సరస్సు నీటిలో చాలా ఎక్కువ ఉప్పు, సోడా ఉన్నాయి.

నీటిలో సోడా, ఉప్పు అధికంగా ఉండటం వల్ల చనిపోయిన మృతదేహాలు ఇప్పటికి అలాగే సురక్షితంగా ఉన్నాయి. తూర్పు ఆఫ్రికాలో కనుమరుగవుతున్న జంతువులపై రాసిన ‘అక్రోస్ ది రావేజ్డ్ ల్యాండ్’ పుస్తకంలో ఈ సరస్సు గురించి చెప్పబడింది. సరస్సు ఉష్ణోగ్రత కూడా 60 డిగ్రీల వరకు ఉంటుందన్నారు. అగ్నిపర్వత బూడిదలో కనిపించే మూలకం ఈ నీటిలో కనిపిస్తుందని చెప్పారు. మమ్మీలను భద్రపరచడానికి ఈజిప్టులు ఈ నీటిని వాడేవారని తెలుస్తోంది.



Below Post Ad


Post a Comment

0 Comments