Anandaiah Medicine: ఆనందయ్య మందుపై కొనసాగుతున్న ఉత్కంఠ.. ఇవాళ ఐసీఎంఆర్‌ బృందం రావడంలేదుః జిల్లా కలెక్టర్

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Anandaiah Medicine: ఆనందయ్య మందు పరిశీలనకు ఐసీఎంఆర్ బృందం రావడం లేదని నెల్లూరు జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ బృందం ఎప్పుడ వస్తుందన్న దానిపై క్లారిటీ రావల్సి ఉందన్నారు.

The ICMR team to Nellore: కృష్ణపట్నం.. ఆనందయ్య మందు కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా సంచలనం రేగుతోంది. కరోనా నివారణకు తయారు చేసిన మందును క్షుణ్ణంగా పరీక్షించే నిమిత్తం సోమవారం ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) బృందం రానున్నట్లు వార్తలు వెల్లవడ్డాయి. అయితే, ఐసీఎంఆర్ బృందం రావడం లేదని నెల్లూరు జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ బృందం ఎప్పుడ వస్తుందన్న దానిపై క్లారిటీ రావల్సి ఉందన్నారు.

జనం నుండి అనూహ్య మద్దతు నేపధ్యంతో శాస్త్రీయ అధ్యయనం కోసం ఆంధ్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపధ్యంలో త్వరగా పరీక్షలు చేసి నివేదిక వెంటనే వచ్చేలా చూడాలంటూ భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించి ఆదేశాలివ్వడం కరోనా రోగులకు కొండంత స్వాంతన కలిగించిన విషయాలు తెలిసిందే. ఈ నేపధ్యంలో నిన్న శనివారం ఆయుష్ ఆయుర్వేద డిపార్టుమెంట్ పరిశీలన జరిపింది. మిగిలిన.. అధ్యయనం కోసం ఇవాళ ఐసీఎంఆర్ బృందం ఆధ్వర్యంలో జరగాల్సి ఉంది. అధ్యయనం చేసేందుకు కృష్ణపట్నం వస్తుండటంతో ఇందుకోసం దేశమంతా అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.


Below Post Ad


Post a Comment

1 Comments