Trending

6/trending/recent

Aadhaar Card: మీ ఆధార్‌ కార్డును ఎవరైనా వాడుతున్నారని అనుమానం ఉందా..? అయితే ఇలా తెలుసుకోండి..!

 Aadhaar Card:ప్రస్తుతం ఆధార్‌ కార్డు అనేది జీవితంలో ముఖ్యమైపోయింది. ఆధార్‌ లేనిది ఏ పనులు జరగవు. ప్రస్తుతం ప్రతి చిన్న పనికి ఎక్కువగా ఉపయోగిస్తున్న గుర్తింపు కార్డు ఆధార్‌. బ్యాంకు ఖాతాల నుంచి మొదలు పెడితే కరోనా పరీక్షల వరకు అన్నింటికి ఆధారే. అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా ఆధార్‌ కార్డును జాగ్రత్తగా ఉంచుకోవాలని పదేపదే సూచిస్తోంది. ఎందుకంటే ఆధార్‌ వల్ల ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. మన ఆధార్‌ కార్డును వేరే వ్యక్తులు కూడా ఉపయోగించి ఏదైనా మోసాలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఆధార్‌ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఒకవేల మీ ఆధార్ కార్డు ఎవరైన వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే ఇక అంతే సంగతులు. అందుకే మన ఆధార్‌ కార్డును ఎవరైనా వాడుతున్నారా?, వారు మన కార్డును ఎక్కడైనా ఉపయోగించారా..? అనే విషయాన్ని తెలుసుకునేందుకు యూఐడీఏఐ కల్పిస్తోంది. మరి ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ విధంగా చేయండి. మీ కార్డును ఎవరైనా వాడినట్లయితే తెలిసిపోతుంది.

► ముందుగా ఆధార్ అధికారిక యూఐడీఏఐ (https://uidai.gov.in/) పోర్టల్ ఓపెన్ చేయండి వెళ్లాలి.

► తర్వాత మై ఆధార్‌ సెక్షన్‌లోకి వెళ్లి ఆధార్‌ సర్వీసెస్‌ను ఎంపిక చేసుకోవాలి.

► ఇక ఆధార్‌ సర్వీస్‌ సెక్షన్‌లో 8వ వరుసలో కనిపించే ఆధార్‌ అథెంటికేషన్‌ హిస్టరీపై క్లిక్‌ చేయాలి.

► ఇప్పుడు ఆధార్‌ నెంబర్‌, క్యాప్చా ఎంటర్‌ చేసి సెండ్‌ ఓటీపీపై క్లిక్‌ చేయాలి.

► ఎప్పటి నుంచి హిస్టరీ కావాలో ఎంచుకుని తేదీ, నెల, సంత్సరం ఎంటర్‌ చేయాలి.

► ఆ తర్వాత మీ ఆధార్‌కు లింక్‌ అయి ఉన్న ఫోన్‌ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. తర్వాత దానిని ఎంటర్‌ చేయాలి.

► ఇప్పుడు మీరు ఏ సమయంలో, ఎక్కడ ఉపయోగించారో పూర్తి వివరాలు తెలిసిపోతాయి.

► ఈ వివరాలన్నీ తెలుసుకోవాలంటే కచ్చితంగా మీ మొబైల్ నెంబర్, ఆధార్ కార్డుకు లింకు అయి ఉండాలి.



Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad