Trending

6/trending/recent

Aadhaar Address Change : అడ్రస్ ప్రూఫ్ లేకుండా ఆన్‌లైన్‌లోనే ఆధార్ కార్డు అడ్రస్ మార్చుకోవచ్చు.. ఎలానంటే?

 ఆధార్ సెంటర్ లేదా ఆధార్ ఈసేవ కేంద్రాకు వెళ్లి అడ్రస్ వివరాలను అప్ డేట్ చేసుకోవచ్చు. ప్రస్తుత మహమ్మారి పరిస్థితుల్లో ఆధార్ కేంద్రాలకు వెళ్లడం సురక్షితం కాదు.. అందుకే UIDAI వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లోనే అడ్రస్ మార్చుకునే అవకాశం కల్పిస్తోంది.

How to change address in Aadhaar card online : ఆధార్ కార్డు అనేది ఒక ముఖ్యమైన గుర్తింపు కార్డు.. 12 అంకెల యూనిక్ నెంబర్ ఉండే ఈ ఆధార్ కార్డును Unique Identification Authority of India (UIDAI) జారీ చేస్తుంది. భారతీయ పౌరులకు ఈ ఆధార్ గుర్తింపు ఎంతో అవసరం. ప్రభుత్వ పథకాల నుంచి రాయితీలు పొందడమే కాదు.. ప్రభుత్వ సర్వీసులు, పెన్షన్ ప్రయోజనాలకు ఆధార్ తప్పనిసరి. ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చెల్లింపు సమయంలో కూడా ఆధార్ తప్పనిసరి. ఆధార్ కార్డులో చాలామంది అడ్రస్ తప్పుగా పడుతుంటుంది.

ఇలాంటి సందర్భాల్లో ఆధార్ సెంటర్ లేదా ఆధార్ ఈసేవ కేంద్రాకు వెళ్లి అడ్రస్ వివరాలను అప్ డేట్ చేసుకోవచ్చు. ప్రస్తుత మహమ్మారి పరిస్థితుల్లో ఆధార్ కేంద్రాలకు వెళ్లడం సురక్షితం కాదు.. అందుకే UIDAI వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లోనే అడ్రస్ మార్చుకునే అవకాశం కల్పిస్తోంది. దీనికి మీకు ఎలాంటి అడ్రస్ ప్రూఫ్ అవసరం లేకుండానే సులభంగా ఆధార్ లో అడ్రస్ మార్చుకోవచ్చు. ఆన్ లైన్ లో ఆధార్ అడ్రస్ ఎలా మార్చుకోవాలో చూద్దాం..

– uidai.gov.in వెబ్ సైటు విజిట్ చేయండి.
– My Aadhaar అనే ట్యాప్ ఓపెన్ చేయండి.. Update Your Address Online ఆప్షన్ ఎంచుకోండి.
– Request Validation Letter అనే ఆప్షన్ పై Click చేయండి.
– మీ ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి.. OTP బటన్ పై క్లిక్ చేయండి.
– మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు OTP వస్తుంది.. దాన్ని అవసరమైన బాక్సులో ఎంటర్ చేయండి.
– మీకో విండో పాప్ అప్ వస్తుంది.. ఆధఆర్ వివరాలను ఎంటర్ చేయాలి.
– Send Request అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేయండి..
– వెరిఫైయింగ్ కోసం మీరు పంపిన అడ్రస్ అప్ డేట్ రిక్వెస్ట్ వెరిఫియర్ కు వెళ్తుంది.
– మీకు SMS ద్వారా ఒక లింక్ మొబైల్ కు వస్తుంది. ఆ లింకు ద్వారా మళ్లీ లాగిన్ కావొచ్చు.
– లింక్ ఓపెన్ చేయగానే.. వెరిఫికేషన్ ప్రాసెస్ కోసం మొబైల్ కు వచ్చిన OTP ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
– ఆ తర్వాత మీకు సర్వీసు రిక్వెస్ట్ నెంబర్ (SRN) పేరిట ఒక SMS లింక్ వస్తుంది..
– ఆ తర్వాత లింక్ ఓపెన్ చేసి.. SRN నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి Send OTP బటన్ పై ట్యాప్ చేయండి.
– మీకో OTP వస్తుంది.. దాన్ని ఎంటర్ చేసి Login పై క్లిక్ చేయండి.
– మీకు ఒక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీ ఆధార్ కార్డు అడ్రస్ అప్ డేట్ అయినట్టు కనిపిస్తుంది.
– ఇప్పుడు ఈ కిందిభాగంలో మీ అంగీకారం తెలియజేస్తూ టిక్ బాక్స్ దగ్గర క్లిక్ చేసి Submit ఆప్షన్ నొక్కండి.
– మీరిచ్చిన ఆధార్ అడ్రస్ ఆధారంగా మీకు వ్యాలిడేషన్ లెటర్ ఇంటి అడ్రస్ వద్దకు వస్తుంది.
– వ్యాలిడేషన్ లెటర్ లో ఒక సీక్రెట్ కోడ్ ఉంటుంది.
-UIDAI సైటులో Update Address online’> Aadhaar number> captcha code > generate OTP> login to site> Update Address via Secret Code> enter the
secret code> Proceed బటన్ పై క్లిక్ చేయండి.
– ఈ ప్రాసెస్ కంప్లీట్ కాగానే.. మీ కొత్త అడ్రస్ ఆధార్ కార్డులో అప్ డేట్ అయిపోతుంది.


Post a Comment

1 Comments
  1. N. Chandra varshaMay 16, 2021 at 3:47 PM

    Neelapu Chandra varsha 4/6/2011late-5-166 ganesh nagar, pathapatnam

    ReplyDelete

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad