దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కల్లోలమే సృష్టిస్తోంది.. ఏ రంగాన్ని వదలకుండా.. అందరినీ వెంటాడుతోంది మహమ్మారి.. అయితే, ప్రభుత్వ రంగ బ్యాంక్.. ఎస్బీఐలోనూ పెద్ద సంఖ్యలో ఉద్యోగులు కోవిడ్ బారినపడుతున్నారు.. కేవలం తెలంగాణలోనే 600 మందికి పైగా ఉద్యోగులకు కోవిడ్ సోకింది.. దీంతో.. దిద్దుబాటు చర్యలకు పూనుకున్న అధికారులు.. సగం మంది ఉద్యోగులతోనే విధులు నిర్వహించాలని కీలక నిర్ణయం తీసుకుంది.. ఇవాళ్టి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు ఎస్బీఐకి చెందిన వివిధ బ్రాంచీల్లో సగం మంది ఉద్యోగులతో విధులు నిర్వహిస్తామని వెల్లడించారు ఎస్‌బీఐ హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఓం ప్రకాశ్ మిశ్రా... ఇక, మహమ్మారి ఉద్ధృతి దృష్ట్యా డిజిటల్ సేవలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఖాతాదారులకు విజ్ఞప్తి చేసిన ఆయన.. అత్యవసరమైతే తప్ప బ్యాంకులకు రావొద్దని సూచించారు. అంతేకాదు.. బ్యాంకు పనిచేసే సమయాన్ని కూడా కుదించారు.. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే పనిచేయనున్న బ్యాంకులు. ఎబ్బీఐతో పాటు పలు బ్యాంకులు కూడా బ్యాంకు సమయాన్ని కుదించాయి.
SBI Working Hours Reduced: ఎస్బీఐలో కరోనా కల్లోలం.. కీలక నిర్ణయం..
April 22, 2021
0