Trending

6/trending/recent

Rock Sugar: పటిక బెల్లం ప్రయోజనాలెన్నో...ఎండ వల్ల వేడిచేసిందా.. ఇలా చేయండి..

Rock Sugar (Mishri): పటిక బెల్లం మనకి తెలిసినదే. ఒకప్పుడు పిల్లలు ఏం తోచటం లేదు, ఏమన్నా తినడానికి పెట్టండి అని గోల పెడితే ఇంత పటిక బెల్లం నోట్లో పడేసి కూర్చోబెట్టే వారు ఇంట్లో పెద్ద వాళ్ళు. ఒకప్పుడు అందరి ఇళ్ళల్లో తప్పని సరిగా ఉండే ఈ పటిక బెల్లానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేమిటో చూసేద్దామా మరి.

పటిక బెల్లం లో ఎస్సెన్షియల్ విటమిన్స్, మినరల్స్, ఎమైనో యాసిడ్స్ ఉన్నాయి. బీ12 అనే విటమిన్ ఎక్కువగా నాన్ వెజిటేరియన్ సోర్చెస్ నుండే లభిస్తుంది. ఆ విటమిన్ ఈ పటిక బెల్లం నుండి కూడా లభిస్తుంది. ఇది ఇంకా ఎందుకు పనికొస్తుందో చూద్దాం రండి.

1. తాజా శ్వాస

భోజనం చేసిన తరువాత మౌత్ వాష్ చేసుకోకపోతే లోపల ఉండే బ్యాక్టీరియా వల్ల నోరు వాసన వస్తుంది. భోజనం తరువాత పటిక బెల్లం కొంచెం చప్పరిస్తే శ్వాస తాజాగా ఉంటుంది. నోరు కూడా ఫ్రెష్ గా ఉంటుంది.

​2. దగ్గు నుండి రిలీఫ్

జ్వరం వచ్చినా, గొంతులో జర్మ్స్ ఉన్నా దగ్గు వస్తుంది. పటిక బెల్లం లో ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్ వలన ఇమ్మీడియెట్ గా దగ్గు తగ్గుతుంది. కొంచెం పటిక బెల్లం తీసుకుని నెమ్మదిగా చప్పరిస్తే దగ్గు నుండి రిలీఫ్ వస్తుంది.

3. సోర్ థ్రోట్ కి మంచిది

చల్లని వాతావరణం వల్ల రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అందులో గొంతు ఇబ్బందిగా మారడం కూడా ఒకటి. పటిక బెల్లం ఇందుకు బాగా పని చేస్తుంది. కొద్దిగా పటిక బెల్లాన్ని మిరియాల పొడి, నెయ్యి తో కలిపి రాత్రి పూట తీసుకోండి.

4. హిమోగ్లోబిన్ పెంచుతుంది

హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే ఎనీమియ, చర్మం పాలిపోవడం, డిజ్జీనెస్, నీరసం, నిస్త్రాణ వంటి వాటితో సఫర్ అవుతారు. పటిక బెల్లం హిమోగ్లోబిన్ లెవెల్స్ పెచడమే కాదు, బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ ని రీజెనరేట్ చేస్తుంది కూడా.

5. అరుగుదలకి సహకరిస్తుంది

నోరు ఫ్రెష్ గా ఉండడానికే కాదు పటిక బెల్లం అరుగుదలకి కూడా హెల్ప్ చేస్తుంది. కొద్దిగా సోంపు గింజలతో కలిపి తీసుకుంటే అందులో ఉండే డైజెస్టివ్ ప్రాపర్టీస్ అరుగుదలకి హెల్ప్ చేస్తాయి. భోజనం తరువాత కొద్దిగా పటిక బెల్లం తీసుకునే అలవాటు చేసుకోండి.

6. తక్షణ శక్తి

భోజనం తరువాత కొద్దిగా పటిక బెల్లం తీసుకుంటే తక్షణ శక్తి లభించినట్లు ఉంటుంది, బాగా రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది. భోజనం తరువాత ఎవరికైనా కొద్దిగా బద్ధకం గా ఉంటుంది, పటిక బెల్లం ఆ బద్ధకాన్ని తరిమి కొడుతుంది. కొద్దిగా సోంపు గింజలతో కలిపి తీసుకుంటే మీకు మంచి ఎనర్జీ బూస్టర్ లా పని చేస్తుంది.

7. ముక్కు నుండి రక్తం కారడం..

ముక్కులో నుండి రక్తం కారడాన్ని కూడా పటిక బెల్లం ఆపుతుందంటే కొద్దిగా ఆశ్చర్యం గానే ఉంటుంది. ముక్కు లో నుండి రక్తం కారుతున్నప్పుడు కొద్దిగా పటిక బెల్లన్ని నీటితో కలిపి తీసుకుంటే వెంటనే రిలీఫ్ వస్తుంది.

8. మెదడుకి మంచిది

పటిక బెల్లం మెదడుకి బాగా మేలు చేస్తుంది. జ్ఞాపక శక్తిని పెంచుతుంది. మెంటల్ ఫెటీగ్ ని దూరం చేస్తుంది. రాత్రి నిద్రకి ముందు పటిక బెల్లాన్ని కొద్దిగా వెచ్చని పాలలో కలుపుకుని తాగండి. ఇలా చేస్తే మెమరీ బాగా పెరుగుతుంది.

9. బాలింతలకి ఉపయోగం

పటిక బెల్లం బాలింతలకి పాలు పడేలా చేస్తుంది. ఇది యాంటీ డిప్రెసెంట్ గా కూడా పని చేస్తుంది. ఇందులో తీపి తక్కువ, తల్లికి దీని వల్ల ఎలాంటీ హానీ ఉండదు.

10. కంటికి మంచిది

పటిక బెల్లం కంటి చూపుకి హెల్ప్ చేస్తుంది. విజన్ ప్రాబ్లమ్స్ రాకుండా, కాటరాక్ట్ రాకుండా పటిక బెల్లం తీసుకోండి. భోజనం తరువాత పటిక బెల్లం కలిపిని నీరు తాగవచ్చు, లేదా రోజంతా ఈ నీటిని కొద్ది కొద్దిగా తాగవచ్చు. ఇందువల్ల మీ విజన్ ఇంప్రూవ్ అవుతుంది, మంచి విజన్ మెయింటెయిన్ అవుతుంది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం.



Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad