Corona Virus: ఏపీని కమ్మేస్తున్న కరోనా..రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh)లో కరోనా (Corona Positive) కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. రోజురోజుకీ యాక్టివ్ కేసులు ఎక్కువవుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. ఆంక్షలు కఠినతరం చేస్తున్నా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

రాష్ట్ర వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 35,962 శాంపిల్స్ ని పరీక్షించగా 6,096 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

జిల్లా వారీగా కరోనా పాజిటివ్ కేసుల వివరాలు చూస్తే.. అనంతపురం జిల్లాలో 313, చిత్తూరు జిల్లాలో 1,024, తూర్పుగోదావరి జిల్లాలో 750, గుంటూరు జిల్లాలో 735, కడప జిల్లాలో 243, కృష్ణాజిల్లాలో 246, కర్నూలు జిల్లాలో550, నెల్లూరు జిల్లాలో 354, ప్రకాశం జిల్లాలో 491, శ్రీకాకుళం జిల్లాలో 534, విశాఖపట్నం జిల్లాలో 489, విజయనగరం జిల్లాలో 299 పశ్చిమగోదావరి జిల్లాలో 68 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 9,48,231కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 9,05,266 మంది డిశ్చార్జ్ అయ్యారు.

గడచిన 24 గంటల్లో 2,194 మంది డిశ్చార్జ్ అవగా.. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 35, 592కి పెరిగింది.

రాష్ట్రంలో గత 24గంటల్లో 20మంది మృతి చెందగా.., మొత్తం మరణాల సంఖ్య 7,373కి చేరింది.

ఇప్పటివరకు రాష్ట్రంలో 1,56,06,163 శాంపిల్స్ పరీక్షించినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.



Below Post Ad


Post a Comment

0 Comments