అమరావతి: రైతు భరోసా కేంద్రం (ఆర్బీకే) నుంచి రైతులు శాస్త్రవేత్తలతో సంభాషించేలా వ్యవస్థను అందుబాటులోకి తేవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. రైతు భరోసా కేంద్ర టీవీ ఛానల్‌ను తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ఆయన ప్రారంభించారు. ఆర్బీకేల్లో విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు కొనుగోలు చేసే రైతులు మోసపోకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. కల్తీ అనేది రైతు దగ్గరకు రాకూడదన్నారు. ఏమైనా సందేహాలుంటే 155251కి టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చన్నారు.