Improper Toilets: మన రాష్ట్రంలో 2000 కు పైగా ప్రైవేట్ పాఠశాలల్లో టాయిలెట్ల వర్కింగ్ కండిషన్ సక్రమంగా లేనట్లు విద్యా శాఖ కమిషనర్ దృష్టికి చేరింది..
ఆయా పాఠశాలల్లో గల టాయిలెట్స్ సక్రమంగా పనిచేసేలా అన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు సూచించవలసిందిగా మరియు ప్రతి మండలంలోని ప్రైవేట్ పాఠశాలల్లో గల టాయిలెట్స్ పనితీరుని పర్యవేక్షించేందుకు గజెటెడ్ అధికారి ర్యాంక్ కు తక్కువ కాని బాధ్యత గల వ్యక్తులను డెప్యూట్ చేయవలసిందిగా అందరు RJD SE లకు , DEO లకు సూచిస్తూ DSE AP శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు మెమో జారీ చేసారు.