Gmail Space: మీ జీమెయిల్ స్టోరేజీ ఫుల్ అయ్యిందా?.. మరేం పర్వాలేదు ఇలా చేయండి స్పేస్‌ను తిరిగి పొందండి..!
ప్రతి గూగుల్ అకౌంట్‌లో 15 జిబి వరకు ఉచిత స్పేస్‌కు అనుమతి ఉంది.
జీమెయిల్‌లో ఇస్తున్న 15 జిబి ఉచితం కిందే గూగుల్ ఫొటోస్, గూగుల్ డ్రైవ్‌కు తోడు గూగుల్ డాక్స్, షీట్స్, స్లయిడ్స్ వస్తాయి.
స్టోరేజీ ఫుల్ అయితే.. ఫైల్స్, ఫొటోలను తొలగించుకోవాల్సి ఉంటుంది. ఫ్రీ స్టోరేజ్ ఒక్కసారి అయిపోతే, ఇకపై మెయిల్స్ రావు. మెయిల్స్ పంపేందుకూ వీలుండదు. కొత్తగా స్పేస్‌ను కొనుగోలు చేయాలి. అలా వద్దు అనుకుంటే.. ఇలా చేయండి.
జీమెయిల్ అకౌంట్‌లో క్లట్టర్‌ను క్లీన్ చేసుకోవాలి. ఆ క్లట్టర్ ఫోల్డర్‌ను క్లీన్ చేసుకోవడం ద్వారా కొంత స్పేస్ వస్తుంది.
ప్రమోషన్, సోషల్, స్పామ్ ఆప్షన్లలో బల్క్‌లో ఫైల్స్ ఉంటాయి. వీటిని తొలగించడం కోసం ఆ మూడింటిలో దేన్నైనా క్లిక్ చేసి డస్ట్‌బిన్‌పై హిట్ చేస్తే మొత్తం డిలీట్ అయిపోయతాయి.
ప్రమోషనల్ మెసేజ్‌లు ఎక్కడనుంచి తరచూగా వస్తున్నాయో చెక్ చేయండి. ఆ తరువాత వాటి మెయిల్ ఐడీని కాపీ చేసి సెర్చ్‌బార్‌లో పేస్ట్ చేయండి. తరవాత డిలీట్ కొడితే అవన్నీ పోతాయి.
డ్రైవ్ కూడా కేటాయించిన 15 జీబీలో భాగమే కాబట్టి దీనిని కూడా ఒకసారి చూస్తే సరిపోతుంది. హైరిజల్యూషన్ ఫోటోలు, డాక్యూమెంట్లన్నీ ఇక్కడే ఉంటాయి. స్టోరేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఉన్న వాటిలో అవసరం లేనివి డిలీట్ చేసుకోవాలి.
ఇక ట్రాష్ వద్దకు వెళ్ళండి. అక్కడ ఉన్నవి అనవసరమైనవా కావా అనేది మరొక్కసారి చెక్ చేసుకుని డిలీట్ చేయండి. అలా చేస్తే చాలా స్పేస్ కలిసి వస్తుంది.