Coronavirus updates: దేశంలో వరుసగా రెండో రోజు 8వేలకు పైగా యాక్టివ్ కేసులు పెరిగాయి. ఇది భయంకరమైన సంకేతం. ప్రభుత్వాలు అప్రమత్తం కావాల్సిన సమయం ఇది అనుకోవచ్చు.
ఇండియాలో కొత్తగా 26,291 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 1,13,85,339కి చేరింది. కొత్తగా 118 మంది కరోనాతో చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 1,58,725కి చేరింది. దేశంలో మరణాల రేటు 1.4 శాతంగా ఉంది. కొత్తగా 17,455 మంది కరోనా నుంచి కోలుకోగా... మొత్తం రికవరీల సంఖ్య 1,10,07,352కి చేరింది. దేశంలో రికవరీ రేటు 96.7 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 2,19,262 యాక్టివ్ కేసులున్నాయి. ఇండియాలో కొత్తగా 7,03,772 టెస్టులు చేశారు. మొత్తం టెస్టుల సంఖ్య 22,74,07,413కి చేరింది.
దేశంలో వరుసగా రెండో రోజు 25వేలకు పైగా కేసులు వచ్చాయి. యాక్టివ్ కేసులు మరో 8.7వేలు పెరిగాయి. మరణాలు వరుసగా ఆరో రోజు 100 కంటే ఎక్కువగా వచ్చాయి. దేశంలోనే ఎక్కువగా మహారాష్ట్రలో నిన్న కొత్త కేసులు 16.6వేలు వచ్చాయి. ఆ తర్వాత కేరళలో 1.8వేలు, పంజాబ్‌లో 1.5వేలు, కర్ణాటకలో 934 కేసులు వచ్చాయి. మహారాష్ట్రలో కొత్తగా 50 మంది చనిపోగా... పంజాబ్‌లో 20 మంది, కేరళలో 15 మంది చనిపోయారు. ఇండియాలో ఇప్పటివరకు 2.99 కోట్ల వ్యాక్సిన్లు వేశారు. 24 రాష్ట్రాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాల్లో యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. కేరళలో యాక్టివ్ కేసులు ఆరు నెలల్లో మొదటిసారి 30వేల కంటే తక్కువగా ఉన్నాయి.
తెలంగాణలో 157 కొత్త కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 3,01,318కి చేరింది. కొత్తగా ఒకరు చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 1654కి చేరింది. మరణాల రేటు 0.54 శాతం ఉంది. తాజాగా 166 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 2,97,681కి చేరింది. రికవరీ రేటు రాష్ట్రంలో 98.79 శాతం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,983 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వాటిలో 718 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. యాక్టివ్ కేసులు 10 తగ్గాయి. ప్రభుత్వం తాజాగా 38,517 టెస్టులు చేయించింది. మొత్తం టెస్టుల సంఖ్య 92,38,982కి చేరింది. GHMC పరిధిలో కొత్తగా 35 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 45,664 టెస్టులు చెయ్యగా 298 మందికి కరోనా ఉంది అని తేలింది. మొత్తం కేసుల సంఖ్య 8,91,861కి చేరింది. కొత్తగా నెల్లూరు, విశాఖపట్నం జిల్లాలో ఇద్దరు మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 7184కి చేరింది. కొత్తగా 164 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 8,83,277కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1400 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,45,34,762 కరోనా టెస్టులు చేశారు.
ప్రపంచ కరోనా కేసులు 12 కోట్లు దాటాయి. అమెరికాలో కరోనా కేసులు 3 కోట్లు దాటాయి. ప్రపంచ మొత్తం కేసుల్లో 25 శాతం అమెరికావే ఉన్నాయి. ప్రపంచ మొత్తం కరోనా మారణాల్లో 20.6 శాతం అమెరికావే ఉన్నాయి. ప్రపంచ దేశాల్లో కొత్తగా 3,58,849 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 12.04 కోట్లు దాటింది. కొత్తగా 5488 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 26.64 లక్షలు దాటింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2.07 కోట్లకు పైగా ఉన్నాయి. ప్రస్తుతం కరోనా సోకిన ప్రతి 100 మందిలో ఇద్దరు చనిపోతున్నారు.

అమెరికాలో కొత్తగా 36,535 పాజిటివ్ కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 3 కోట్లు దాటింది. కొత్తగా 615 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 5.47 లక్షలు దాటింది. ప్రస్తుతం ప్రపంచ మొత్తం పాజిటివ్ కేసుల్లో అమెరికా టాప్‌లో ఉంది. బ్రెజిల్, ఇండియా, రష్యా, బ్రిటన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రోజువారీ కొత్త కేసుల్లో బ్రెజిల్ టాప్‌లో ఉంది. అక్కడ కొత్తగా 44,120 కేసులొచ్చాయి. బ్రెజిల్ తర్వాత అమెరికా, ఇండియా, ఫ్రాన్స్, ఇటలీ ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచ మొత్తం మరణాల్లో అమెరికా టాప్‌లో ఉంది. బ్రెజిల్, మెక్సికో, ఇండియా, బ్రిటన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రోజువారీ కొత్త మరణాల్లో బ్రెజిల్ (1,013) టాప్‌లో ఉంది. ఆ తర్వాత మెక్సికో (639), అమెరికా (615), రష్యా (395), ఇటలీ (264) తర్వాతి పొజిషన్లలో ఉన్నాయి.