Corona Terror in AP: ఏపీలో మరింత పెరిగిన కరోనా తీవ్రత

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en
  • కొత్తగా 1,184 పాజిటివ్‌ కేసులు..
  • అత్యధికంగా గుంటూరులో 352 మందికి సోకిన వైరస్‌

Corona Terror in AP: ఏపీలో కరోనా తీవ్రత మరింత పెరుగుతోంది. ఒక్కరోజు వ్యవధిలో 30,964 నమూనాలను పరీక్షించగా 1,184 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 352, అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 19 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌లో వెల్లడించింది. తాజా సంఖ్యతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 9,01,989కి చేరింది. 

24 గంటల వ్యవధిలో కొవిడ్‌ చికిత్స పొందుతూ నలుగురు మృతిచెందారు. చిత్తూరు జిల్లాలో ముగ్గురు, నెల్లూరు జిల్లాలో ఒకరు మరణించారు. తాజా మరణాలతో రాష్ట్రంలో కొవిడ్‌తో మృతిచెందిన వారి సంఖ్య 7,217కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 456 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం 7,338 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,50,83,179 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.


Below Post Ad


Post a Comment

0 Comments