Aadhaar is No Longer Mandatory: పింఛన్ లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జీవన్ ప్రమాణ్ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ పొందేందుకు పెన్షనర్లకు ఇక ఆధార్‌కార్డు తప్పనిసరి కాదని తేల్చి చెప్పింది. లబ్ధిదారులు తమ పెన్షన్ పొందేందుకు జీవన్ ప్రమాణ్ డిజిటల్ సర్టిఫికెట్‌ను కేంద్రం ఇటీవల తప్పనిసరి చేసింది. అయితే, ఆధార్ అథెంటికేషన్ విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నట్టు పెన్షనర్ల నుంచి ఫిర్యాదులు రావడంతో తాజాగా మరో ప్రకటన చేసింది.
ఆధార్ అథెంటికేషన్ స్వచ్ఛందమేనని, మెసేజ్‌ల కోసం, హాజరు నిర్వహణ కోసం
నచ్చితే ఆధార్ వెరిఫికేషన్‌ను స్వచ్ఛంగా చేసుకోవచ్చని పేర్కొంది. ఇప్పుడు
పింఛనుదారులకు జీవన్ ప్రమన్ లేఖను డిజిటల్‌గా పొందటానికి ఆధార్ స్వచ్ఛందంగా
చేయబడింది. జీవన్ ప్రమాణ్‌లో ఆధార్ అథెంటికేషన్ అనేది స్వచ్ఛందమేనని..
ఇష్టం లేకుంటే ప్రత్యామ్నాయంగా లైఫ్ సర్టిఫికెట్‌ను కూడా ఇవ్వొచ్చని
ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వశాఖ ఓ నోటిఫికేషన్ విడదుల చేసింది.
ఇప్పటి వరకు పెన్షనర్లు తమ పెన్షన్ తీసుకోవడానికి ముందు సంబంధిత
అధికారులు జారీ చేసిన లైఫ్ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉండేది. అయితే,
ఇది ప్రతిసారీ సమర్పించడం పెన్షనర్లకు ఇబ్బందికరంగా మారడంతో ప్రభుత్వం
డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌ను తీసుకొచ్చింది. దీనివల్ల భౌతికంగా లైఫ్
సర్టిఫికెట్‌ను మోసుకెళ్లే బాధతప్పుతుంది.
అయితే, తమ ఫింగర్ ప్రింట్లు రీడ్ కాకపోవడంతో ఇబ్బందులు
ఎదురవుతున్నాయని పెన్షనర్లు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన
ప్రభుత్వం ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి కాదని, అది ఇష్టపూర్వకమేనని
ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది.
మార్చి 18 న ఎలక్ట్రానిక్స్‌తోపాటు ఐటి మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ఇది. ఈ సందర్భంలో, ఎన్‌ఐసి ఆధార్ లా 2016, ఆధార్ రెగ్యులేషన్ 2016, ఆఫీస్ మెమోరాండం, యుఐడిఎఐ జారీ చేసిన సర్క్యులర్లతోపాటు మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు పాటించాల్సి ఉంటుంది.