Trending

ఖాళీల కంగాళీ

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en
  • ఖాళీల్లో ఎస్‌ఏ-10 శాతం, ఎస్జీటీ-5 శాతం బ్లాక్‌కు చర్యలు
  • పరిశీలనాంతరం663 పోస్టుల నిలిపివేత
  • డీఈవో బ్లాగ్‌లో సీనియార్టీ జాబితా

ఉపాధ్యాయ బదిలీ దరఖాస్తుల ప్రక్రియ పూర్తైనప్పటికీ ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో తెలియక ఆందోళన చెందుతున్నారు. గతంలో క్లియర్‌ వేకెన్సీలు, రేషనలైజేషన్‌ ఖాళీలు ఇలా ప్రతిదీ చూపించి ఆ మేరకు బదిలీలు కోరుకునే అవకాశం కల్పించేవారు. ఈ సారి ప్రతి మండలంలో ఉన్న మొత్తం ఖాళీల్లో ఎస్జీటీలో ఐదుశాతం, పాఠశాల సహాయకుల్లో పదిశాతం బ్లాక్‌ చేశారు. మండల విద్యాధికారులు 853 పోస్టులను బ్లాక్‌ చేయగా జిల్లా విద్యాధికారి మరోసారి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించి ఈ సంఖ్యను 663కు తగ్గించారు. మిగిలిపోయిన ఖాళీలను తిరిగి ఎలా నింపుతారని ఉపాధ్యాయుల్లో ఉత్కంఠ నెలకొంది. బ్లాక్‌ చేసిన ఖాళీలను సిఫార్సు బదిలీలతో భర్తీ చేస్తారేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ బదిలీల్లో గ్రామాలకు రహదారి, రవాణా సౌకర్యం లేకుండా ఉన్నవి 150కి పైగా పాఠశాలలను కేటగిరి-4గా గుర్తించారు. 

న్యూస్‌ టోన్, కర్నూలు విద్య: ప్రతి మండలంలో కేటగిరి 1, 2, 3 పోస్టుల్లో పది శాతం ఖాళీలను రిజర్వు చేయాలనే విద్యాశాఖ నుంచి ఆదేశాలు జారీ చేశారు. మండల స్థాయిలో ఎంఈవోలు ఎక్కువ సంఖ్యలో బ్లాక్‌ చేయడంతో విమర్శలు వచ్చిన నేపథ్యంలో విద్యాధికారులు మరోసారి పరిశీలించి 190 పోస్టులు ఓపెన్‌ చేశారు. ఏకోపాధ్యాయ పాఠశాలలు తగ్గించడానికే నిర్ణయం తీసుకున్నామని అధికారులు చెబుతున్నా వీటిపైనే ఆశలు పెట్టుకున్న సీనియర్‌ ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. ధ్రువపత్రాల పరిశీలనాంతరం తాత్కాలిక సీనియార్టీ జాబితా మేరకు ఖాళీల ఎంపిక జరగనుంది. స్పష్టత ఇవ్వని అధికారులు బదిలీల్లో అనుసరిస్తున్న విధానాలు ఉపాధ్యాయుల్లో కొందరికి ప్రయోజనం చేకూరుస్తుండగా..ఇంకొందరికి నష్టం కలిగిస్తున్నాయి. అన్ని కేటగిరిల్లో కంటే ఎస్జీటీలే ఎక్కువ సంఖ్యలో బదిలీ కానున్నారు. తప్పనిసరి కావాల్సిన 2264 మంది ఉపాధ్యాయుల్లో 80 శాతం ఎస్జీటీలే ఉన్నారు. దీంతో 1798 ఖాళీ పోస్టుల్లో అధికారులు 439 పోస్టులను పలు కారణాలతో బ్లాక్‌ చేశారు. ఈ కేటగిరి బదిలీలు మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ ద్వారా నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఐదు విద్యా సంవత్సరాల స్థానంలో సర్వీసును పరిగణనలోకి తీసుకోవడంతో 14 మంది మాత్రమే తప్పనిసరి బదిలీ కావాల్సి వస్తోంది. స్టేషన్‌ సీనియార్టీ సీలింగ్‌ పాయింట్లు తొలగించడంతో 2132 మంది ఎస్జీటీ, పాఠశాల సహాయకులు లబ్ధి పొందనున్నారు. కౌన్సెలింగ్‌ విధానంపై ఉపాధ్యాయ సంఘాల డిమాండ్‌పై స్పందించి  గతనెల 30న ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌పై డెమో ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా ఇంతవరకు చేపట్టలేదు.

*నవంబరు 28 నుంచి కొత్త షెడ్యూల్‌్ ప్రారంభమైంది. ప్రొవిజన్‌ సీనియార్టీ జాబితాను గురువారం ఆన్‌లైన్‌లో పొందుపరిచారు.

* జిల్లాలో కచ్చితం -2,195 మంది, విన్నపం - 4,144 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు.

 *ప్రిఫరెన్షియల్‌ కేటగిరిలో 266 మంది దరఖాస్తు చేసుకోగా, అందులో 36 మంది ఆరోగ్య సమస్యలు, 59 మంది వ్యక్తిగత సమస్యలు, 76 మంది పెళ్లికానివారు, ఇతరులు.

* స్పౌజ్‌ కేటగిరిలో 721 మంది దరఖాస్తు చేసుకున్నారు. విద్యాశాఖ ప్రాథమిక దశలోనే తప్పులను అడ్డుకోగలుగుతోంది.

* ఏమైనా అభ్యంతరాలుంటే సోమవారం వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని విద్యాధికారులు  చెబుతున్నారు.

NO OBJECTIVE VACANCIES

Below Post Ad


Post a Comment

0 Comments