డీఎస్సీ అభ్యర్థుల తరఫున పోరాటం చేస్తాం

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en
  • రిలే నిరాహార దీక్షలో  ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి

అలంకార్‌కూడలి(విజయవాడ), న్యూస్‌ టోన్ : డీఎస్సీ-2008 అభ్యర్థుల తరఫున పోరాటం కొనసాగిస్తామని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి అన్నారు. నగరంలోని ధర్నాచౌక్‌లో ఏపీ బీఈడీ విద్యార్థుల అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ‘జగనన్న మీద అలక’ రిలే నిరాహార దీక్షలు ఆదివారం రెండో రోజు కొనసాగాయి. ఎమ్మెల్సీ నరసింహారెడ్డి వారికి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్సీ-2008 విల్లింగ్‌ ఇచ్చిన 2193 మంది అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేయాలని డిమాండ్‌ చేశారు. విద్యాశాఖ మంత్రి ఇచ్చిన హామీకి దిక్కు లేకుండా పోయిందన్నారు. ఆర్థికశాఖ అనుమతి ఇచ్చినా ఎందుకు ఆలస్యమవుతుందో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్‌ చేశారు. అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు తాము అండగా ఉండి పోరాటం చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఏపీ బీఈడీ విద్యార్థులు అసోసియేషన్‌ కార్యదర్శి బి.ఎన్‌.సత్యనారాయణ, సభ్యులు శ్రీనివాసరావు, తిరుపతిరావు, అరుణ, తదితరులు పాల్గొన్నారు. 

AGITATION FOR DSC 2008 WILLING CANDIDATES

Below Post Ad


Tags

Post a Comment

0 Comments